ETV Bharat / city

PV sindhu In vijayawada: విజయవాడకు పీవీ సింధు.. మంత్రుల ఘనస్వాగతం - ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి.సింధు

ఒలింపిక్స్ పతకంతో రాష్ట్రానికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. ఏపీలోని విజయవాడకు చేరుకున్న సింధుకు మంత్రులు అవంతి, కృష్ణదాస్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం పలికారు.

PV sindhu In vijayawad
విజయవాడకు పీవీ సింధు
author img

By

Published : Aug 5, 2021, 11:25 PM IST

ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు విజయవాడ చేరుకుంది. మంత్రులు అవంతి, కృష్ణదాస్.. కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్.. సింధుకు స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఏపీ సీఎం జగన్ మద్దతిచ్చారని సింధు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఇప్పుడు పతకంతో రాష్ట్రానికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తనపై అభిమానం చూపినవారికి పతకం అంకితమిస్తున్నట్టు చెప్పింది.

సింధు విజయవాడకు చేరుకున్న సందర్భాన్ని నగర ప్రజలు, ప్రత్యేకంగా ఆమె అభిమానులు.. గ్రాండ్​ సెలెబ్రేషన్స్​ చేశారు. బాణసంచా కాల్చి మరీ స్వాగతం పలికారు. సింధుతో ఫొటో దిగేందుకు ఉత్సాహాన్ని చూపించారు.

"ఒలింపిక్స్​కు వెళ్లే ముందు కూడా విజయవాడకు వచ్చాను. నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎంకరేజ్ చేశారు. ఏది కావాలన్నా సమకూరుస్తామని ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ఇచ్చారు. మరిన్ని విజయాలు సాధిస్తానని నమ్మకంగా ఉంది. ఒలింపిక్స్​లో పతకం సాధించడం ఎవరికైనా కల. అలాంటిది వరుసగా రెండు సార్లు పతకాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. గెలిచిన తర్వాత ఓ క్షణం నన్ను నేను మర్చిపోయాను. ఈ విజయం కోసం చాలా కష్టపడ్డాను. తల్లిదండ్రులతో పాటు.. మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. వారి కోసం ఈ పతకాన్ని అంకితం చేస్తున్నా." - పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ఇదీ చదవండి:

Ravi Kumar Dahiya: రైతుబిడ్డ.. 'పట్టు' పట్టి రజతం తెచ్చాడు..

Hockey India: హాకీ జట్టుకు కాంస్యం- తెర వెనుక ఆ 'సీఎం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.