ETV Bharat / city

Ys viveka: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్యకేసు విచారణలో ఈరోజు ఏం జరిగిందంటే..? - మణికంఠరెడ్డిపై వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు

ఏపీ మాజీమంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో 69వ రోజు సీబీఐ విచారణ జరిగింది. పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కుమార్తె.. ఫిర్యాదుపై చర్యలు చేపట్టిన పోలీసులు.. రెక్కీ నిర్వహించిన మణికంఠరెడ్డిపై బెైండోవర్​ కేసు నమోదుచేశారు.

ys viveka murder case investigation
ys viveka murder case investigation
author img

By

Published : Aug 14, 2021, 8:00 PM IST

ఏపీ మాజీమంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు విచారణ చేపట్టాయి. పులివెందుల అతిథి గృహంలో సీబీఐ విచారణకు నలుగురు అనుమానితులు హాజరయ్యారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు కాగా ప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్​గా పనిచేస్తున్నాడు.

వీరితో పాటు.. ఉదయ్​కుమార్​రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న బాబురెడ్డి దంపతులనూ పలు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మరో సీబీఐ బృందం ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్​యాదవ్​తో పాటు అతని సమీప బంధువు భరత్​కుమార్​ యాదవ్​ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద మణికంఠరెడ్డి రెండుసార్లు బైక్​పై వచ్చి కాంపౌండ్ లోపల కూడా తిరిగినట్లు సునీత... ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇవాళ మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఆ ప్రాంతంలో సంచరించాల్సి వచ్చింది, ఎవరు సూచనల మేరకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపైన మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం... మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. జమ్మలమడుగు ఆర్డీవో వద్ద పోలీసులు బైండోవర్ చేయించారు.

వివేకా కుమార్తె ఫిర్యాదులో ఏముందంటే..

'ఈ నెల పదోతేదీన కడప జిల్లా పులివెందులలోని మా ఇంటివద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడు. ఇతడు మా తండ్రి హత్యకేసులో అనుమానితుడు, వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పులివెందులలో మణికంఠరెడ్డి చిత్రాలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అతడు మా ఇంటిదగ్గర రెక్కీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించి ఇతడే ఆ ఫ్లెక్సీల్లోని వ్యక్తిగా నిర్ధరణకు వచ్చాను. దీనిపై పులివెందుల సీఐ భాస్కరరెడ్డికి ఈ నెల 12న సమాచారం అందించాను. ఆయన మా ఇంటికి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, పనివారిని విచారించారు.

-వివేకా కుమార్తె సునీత

ఇదీచూడండి: Sunitha letter reaction: సునీత లేఖ... మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.