ETV Bharat / city

Puffer Fish: ముళ్ల కప్పను ఎప్పుడైనా చూశారా.?

Puffer Fish: విశ్వంలో ఎన్నో వింతలు.. విచిత్రాలు జరుగుతుంటాయి. నిత్యం ఏదో ఒకచోట మనకు తెలియని విషయం బయటపడుతుంటుంది. సముద్ర గర్భంలో ఎన్నో విచిత్రమైన జీవులున్నాయి. అవి ఎప్పుడో ఓసారి మన ముందుకు వస్తుంటాయి. అలా తాజాగా ఓ ముళ్ల కప్ప వచ్చింది.

Puffer Fish
ముళ్ల కప్ప
author img

By

Published : Mar 23, 2022, 12:58 PM IST

Puffer Fish
ముళ్ల కప్ప

Puffer Fish: ఇక్కడ తల భాగంలో ముళ్లతో విచిత్రంగా కనిపిస్తున్న సముద్రజీవిని జాలర్లు ముళ్ల కప్ప అంటారు. విశాఖ రుషికొండ సమీప కార్తికవనం వద్ద సముద్రంలో మంగళవారం జాలరుల వలకు చిక్కింది. దీని వ్యవహారిక నామం 'పఫర్‌ ఫిష్‌' అని విశాఖలోని మత్స్య శాఖ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. చిన్న చేపలు, నాచు తింటూ మనుగడ సాగించే ఈ కప్పలు.. ప్రమాద సమయాల్లో రక్షణ కోసం తల భాగంలోని ముళ్లతో ప్రతిఘటిస్తాయని చెప్పారు. ఇవి ఒక్కోటి రెండు కిలోలకుపైగా బరువు పెరుగుతాయన్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 'పోలీసు' ట్రైనింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.