AP HIGH COURT : ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజకీయ నేతల పేర్లు పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. పథకాల పేర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం, పెట్టిన పేర్లను పరిశీలించి ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.
AP HIGH COURT News : అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత పేర్లను ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నిస్తూ కేంద్రం..రాష్ట్ర సీఎస్‌కు రాసిన లేఖ వివరాలను అదనపు అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాజకీయ నేతల పేర్లతో పాటు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
- ఇదీ చదవండి : ఆపన్నుల పాలిట అమృతమూర్తి.. మధులికా రావత్