ETV Bharat / city

న్యాయమైన ఫిట్​మెంట్​ ప్రకటించాలి: పీఆర్టీయూ - పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం అంజిరెడ్డి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమానికి దిగకముందే... ముఖ్యమంత్రి న్యాయమైన ఫిట్​మెంట్​ ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమానికి అండగా నిలిచిన వారిని నయవంచన చేయవద్దని కోరారు.

prtu state president m anjireddy demands to government for betterment in fitment
ఉద్యమించక ముందే న్యాయమైన ఫిట్​మెంట్​ ప్రకటించాలి: పీఆర్టీయూ
author img

By

Published : Jan 28, 2021, 8:33 PM IST

తెలంగాణ సాధించుకున్నట్లే ఉద్యోగులు, ఉపాధ్యాయుల తడాఖా చూపించి మెరుగైన పీఆర్సీ సాధిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. అంజిరెడ్డి అన్నారు. పీఆర్టీయూ ప్రతినిధులతో చర్చలు జరిగిన సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ... పీఆర్సీ నివేదికపై అభిప్రాయాలు, సూచనలు తీసుకొంది. పీఆర్సీ నివేదికతో సీఎం కేసీఆర్ నిజస్వరూపం తేలిపోయిందని... చెత్తబుట్టలో వేసేందుకు పనికిరాదని ఎద్దేవా చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులను సంతృప్తిగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులను నయవంచన చేయవద్దని కోరారు. ఉద్యోగులు ఆందోళనకు దిగకముందే సీఎం... న్యాయమైన ఫిట్​మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమించక ముందే న్యాయమైన ఫిట్​మెంట్​ ప్రకటించాలి: పీఆర్టీయూ

ఇదీ చూడండి: సాగుచట్టాలతో 'పెద్దోళ్ల'కు మేలు.. రైతులకు ఉరితాడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.