రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వెరియంట్ తీవ్రత చూపిందని చెప్పారు. అనేక దేశాల్లో డెల్టా రకం ఉద్ధృతంగా ఉందన్నారు. దేశంలో కేరళలోనే 50 శాతం డెల్టా కేసులున్నాయని వెల్లడించారు. శరీరంపై ఎక్కువకాలం డెల్టా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందని వివరించారు.
9 జిల్లాల్లో ఎక్కువగా కేసులు
డెల్టా వైరస్‌లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీగా కేసులు నమోదైన ఘటనలు ఉన్నాయన్నారు. కరోనా బాధితులు బయట తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మూడో దశగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీహెచ్ స్పష్టం చేశారు.
9.5 లక్షల మందికి రెండు డోసులు
రాష్ట్రంలో 2.2 కోట్ల మంది వ్యాక్సిన్‌కి అర్హులుగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి ఒక డోసు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 33.79 లక్షలమందికి రెండు డోసులు వేశామని తెలిపారు. కేటాయింపునకు అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయని వివరించారు. ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Bandi sanjay: 'మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోం'