ధరణి పోర్టల్‌లో కొన్ని ఆప్షన్లు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్‌కు అవకాశం ఇచ్చారు. నాలా కోసం వచ్చిన దరఖాస్తుల్ని తిరస్కరించే అవకాశం ధరణి పోర్టల్‌లో లేదు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్, కాలువలు, హైటెన్షన్ తీగలు, చారిత్రక కట్టడాలకు నిర్ణీత దూరం వరకు నాలా కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వరు. నాలా దరఖాస్తుల్ని తిరస్కరించే ఆప్షన్ ధరణిలో లేకపోవడంతో.... ఇటీవల మేడ్చల్‌లో పది ఎకరాల భూమి వ్యవసాయేతర వినియోగానికి అనుమతి ఇచ్చారు.ఇందులో 6ఎకరాల విస్తీర్ణం బఫర్ జోన్లో ఉంది.
చెరువు భూమికి దరఖాస్తు..
సంగారెడ్డి మహబూబ్‌సాగర్ చెరువులో ఉన్న భూమికి సైతం నాలా కోసం దరఖాస్తు వచ్చింది. ఇది చెరువుగా గుర్తించిన తహసీల్దార్ దరఖాస్తును ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. నాలా దరఖాస్తుల్ని తిరస్కరించే అవకాశం లేదని... సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌పై కలెక్టర్లతో ఈనెల 9న ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సమీక్ష తర్వాత పోర్టల్‌లో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవిన్యూ అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: నీటిలో నానబెడితే చాలు అన్నం రెడీ.. ఆ 'మ్యాజిక్' ఎంటో తెలుసా?