- నానక్‌రాంగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గత నెల ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కలిపి మొత్తం 1094 టెస్టులు చేశారు. డిసెంబరులో మొదటి 13 రోజులకే 600 పరీక్షలు చేశారు.
- గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రిలో గత నెల వరకు రోజుకు 30-40 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 70-90 దాటుతోంది. అక్కడే ఉన్న ఓ ప్రైవేటు ల్యాబ్‌లో రోజు వారీ పరీక్షల సంఖ్య వంద దాటుతోంది.
Corona Test Reports : ఒమిక్రాన్ ఆందోళన ఒకవైపు.. ఇతర దేశాలకు వెళ్లే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేయడంతో ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడినా సరే.. వైద్యులు తొలుత కరోనా టెస్టులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అమలవని ప్రభుత్వ ఉత్తర్వులు
Corona Test fee : ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని కొన్ని ల్యాబ్‌లు టెస్టుల పేరుతో దోపిడీ మొదలెట్టాయి. గతంలో ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్ ధర రూ.850 ఉండగా.. తరువాత రూ.500కు తగ్గించారు. ఇంటికి వచ్చి సేకరించే నమూనా ధర రూ.1200 ఉంటే రూ.750కు తగ్గిస్తూ వైద్యశాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని చాలా ల్యాబ్‌లు అమలు చేయడం లేదు. వేగంగా నివేదికలిస్తామంటూ అదనంగా బాదుతున్నారు.
సర్కారీ దవాఖానాల్లో ఆలస్యం
Corona Test fee in Private Labs : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉచితంగానే చేస్తున్నా నివేదిక అందడంలో జాప్యం జరుగుతోంది. 24-48 గంటలు పడుతోంది. నమూనాలు ఎక్కువగా ఉంటే.. అది 72 గంటలకు చేరుతోంది. విదేశాలకు వెళ్లే వారితోపాటు కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలంటే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి. ఇలాంటి వారికి గంటల వ్యవధిలో నివేదిక అవసరమవుతోంది. దీంతో చాలామంది ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. వీటిపై వైద్యఆరోగ్య శాఖ పరంగా ఎలాంటి నిఘా లేకపోవడంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
విమానాశ్రయంలో జేబుకు ‘పరీక్ష’!
Corona Tests in Hyderabad Airport : హైదరాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అన్ని విమానాశ్రయాల కంటే హైదరాబాద్‌లో అధిక రుసుములు వసూలు చేస్తున్నారు. ఇక్కడకు నిత్యం 3వేల నుంచి 3500 మంది ప్రయాణికులు విదేశాల నుంచి వస్తుంటారు. ముప్పు(రిస్క్) ఉన్న దేశాల నుంచి వచ్చే 200-300 మందితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ర్యాండమ్‌గా 2 శాతం మొత్తం నిత్యం 300-400 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే ఫలితాలకు 4-6 గంటలు పడుతుండగా.. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్‌కు 1-2 గంటల్లోనే వస్తున్నాయి. త్వరగా వెళ్లాలని ప్రయాణికులు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్‌ను ఎంచుకుంటున్నారు.