president winter sojourn: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన రద్దు అయింది. శీతాకాల విడిది కోసం ఈనెల 29న హైదరాబాద్ వస్తారని, వచ్చే నెల మూడో తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తారని కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన రద్దైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఇదీచూడండి: గుడ్ గవర్నెన్స్‌లో రెండు అవార్డులు.. కేసీఆర్ పాలనాదక్షతకు తార్కాణం.: కేటీఆర్