Presidential Fleet Review: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తూ ఫ్లీట్ రివ్యూలో యుద్ధనౌకల విన్యాసాలు సాగుతున్నాయి. గగనతలంలోనూ రామ్‌నాథ్ కోవింద్‌కు సెల్యూట్ చేస్తూ ఎయిర్‌క్రాఫ్టులు చేస్తున్న విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు.
మిలన్-2022 పేరుతో ఫ్లీట్ రివ్యూ...
సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. మిలన్-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి.
పాల్గొనే యుద్ధనౌకలు..
ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామి, ఐఎన్‌ఎస్ చెన్నై, ఐఎన్‌ఎస్ దిల్లీ, ఐఎన్‌ఎస్ తేజ్, శివాలిక్ శ్రేణి యుద్ధనౌకలు మూడు, కమోర్తా యుద్ధనౌకలు మూడు, కోస్ట్‌గార్డ్, ఎన్ఐఓటి.. షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన నౌకలు పీఎఫ్‌ఆర్‌లో పాల్గొన్నాయి.
- చేతక్, ఏఎల్‌హెచ్., సీకింగ్, కమోవ్ హెలికాప్టర్లు, డోర్నియర్, ఐ.ఎల్.-38ఎస్.డి., పి8ఐ, హాక్, మిగ్ 29కే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో సముద్రం మధ్యన విన్యాసాలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: