రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. కాసేపట్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల పద్మావతి అతిథిగృహం వెళ్లనున్నారు.
మధ్యాహ్నం వరాహస్వామిని దర్శించుకుని.. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి చెన్నై తిరిగి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఇవీచూడండి: కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ