సీతానగరం శిరోముండనం కేసును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. ఏపీ సాధారణ పరిపాలన విభాగానికి సంబంధిత దస్త్రం బదిలీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్‌బాబును కలవాలని బాధితుడు ప్రసాద్‌కు ఆదేశం పంపింది. ఈ కేసు విషయంలో జనార్దన్‌బాబుకు సహకరించాలని ప్రసాద్‌కు సూచించింది.
త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు ప్రసాద్ జనార్దన్‌బాబును కలవనున్నారు. వీడియో క్లిప్పులు, కాల్ రికార్డులతో జనార్దన్‌బాబును కలవనున్నారు. ఇటీవలే బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారు. బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్రపతి కార్యాలయానికి ఈమేరకు ఏపీ ప్రభుత్వం సమాధానం పంపింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడు ఫిర్యాదుతో ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడం సహా పోలీస్‌స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.
ఇవీచూడండి: 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ
దాష్టీకం: పోలీస్ స్టేషన్లో యువకుడికి శిరోముండనం