గాంధీ జయంతి సందర్భంగా సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే సిద్ధం చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హుల జాబితాతో కూడిన దస్త్రాన్ని సీఎం కార్యాలయానికి పంపారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌కు చేరుతుంది. గవర్నర్ ఆమోదిస్తే అక్టోబరు 2వ తేదీన ఖైదీలను విడుదల చేస్తారు. వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గత ఆగస్టు 15న ఖైదీలను విడుదల చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వీలుపడలేదు.
ఇదీ చూడండి : ‘స్వచ్ఛ భారత్’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ