ETV Bharat / city

'వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్​లు సిద్ధం చేయండి'

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం... అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల సవివర నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఇంజినీర్లను ఆదేశించారు.

DPR
డీపీఆర్
author img

By

Published : Aug 28, 2021, 3:22 AM IST

కృష్ణా, గోదావరి నదులపై వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల సవివర నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లతో ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం... అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో పనులు నిలిపివేయాలని, పూర్తయినప్పటికీ వినియోగించకూడదని పేర్కొంది.

ఈ మేరకు ఆయా ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ లో చేర్చారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం 37 ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, ఎస్సెల్బీసీ, ఏఎమ్మార్పీ, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు, సీతారామ, కంతనపల్లి, ప్రాణహిత, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టులుగా కేంద్రం పేర్కొంది. వీటన్నింటికీ ఆర్నెళ్లలోగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్​లు తయారు చేసి అనుమతుల కోసం పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్​లు తయారు చేయాలని సీఈలను రజత్ కుమార్ ఆదేశించారు.

ఇదీ చదవండి: CM KCR REVIEW: 'గట్టిగా పట్టుబడతా.. చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.