భారతీయ సంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో.. సనాతన గో సంస్కృతి ఫౌండేషన్, ఓం సాయి సురభి క్యాంపెన్లు గొబ్బెమ్మ తయారి పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా జనవరి 10న తెలుగు రాష్ట్రాల మహిళలను ఆహ్వానిస్తోంది.
ఎక్కడివారక్కడే...
పోటీల విశేషాలను సనాతన గో సంస్కృతి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జనవరి 10న ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనే మహిళలు.. ఎక్కడివారక్కడే వారి గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని గోశాల వద్దకెళ్లి గొబ్బెమ్మ తయారు చేయాలన్నారు.
గొబ్బెమ్మ తయారు చేసే గ్రూప్ ఫోటో, ఒక నిమిషం వీడియో మెయిల్ చేయాలి. గోమాత పేడతో స్వస్తిక్, శుభం, లాభం, హోమం, దీపాలు తయారు చేసి ప్రజలకు అందించడమే తమ లక్ష్యం. అందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. -ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్