ETV Bharat / city

నీట్ సీటు సాధనకు ఐదు సూత్రాలు!

జాతీయ స్థాయి వైద్య కళాశాలలో మెడిసన్​ చదవాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటుంటారు. అందుకు నీట్​ కోసం కష్టపడుతుంటారు. నీట్​లో అర్హత సాధించినట్లయితే దేశంలోని ప్రముఖ వైద్య, దంత కళాశాలలో సీటు​ సంపాదించుకోవచ్చు. కానీ ఆ ఆశయ సాధనకు సరైన ప్రణాళిక అవసరం. అదేంటో చూద్దాం..

neet exam 2021
నీట్​ 2021
author img

By

Published : Mar 27, 2021, 3:00 PM IST

దేశంలోని వైద్య‌, దంత క‌ళాశాలల్లో ప్ర‌వేశానికి నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)ను ఆగ‌స్టు 1, 2021న ‌నిర్వ‌హించ‌నున్నారు. ఆశించిన కళాశాలలో సీటు దక్కించుకోవాలంటే పోటీలో ముందుండాలి. మంచి స్కోరు సంపాదించుకోవాలి. అందుకు తగిన అధ్యయన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ సన్నద్ధత ప్రణాళికను రూపొందించుకునే క్రమంలో కొన్ని పద్ధతులు పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

‣ ప్రిపరేషన్‌లో విద్యార్థులు పాటించాల్సిన మెలకువలు

1. అనుకూలమైన టైమ్‌టేబుల్ త‌యారీ

neet exam 2021
అనుకూలంగా టైమ్‌టేబుల్​ను రూపొందించుకోవాలి

‣ విజయాన్ని నిర్ణయించడంలో ప్రణాళిక కీలకపాత్ర పోషిస్తుంది. నీట్‌ను టాస్క్‌లాగా భావించి టైమ్‌టేబుల్ త‌యారు చేసుకోవాలి. దానివ‌ల్ల వెచ్చించాల్సిన‌ స‌మ‌యంపై స‌రైన అవ‌గాహన ఏర్ప‌డుతుంది. అలాగే క‌చ్చిత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌డానికీ వీలవుతుంది. ప‌రీక్ష‌ను సమర్థంగా ఎదుర్కోడానికి విద్యార్థి చేయాల్సిన మొద‌టి ప‌ని టైమ్‌టేబుల్ తయారు చేసుకోవడం. ఆ సమయంలో కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

‣ మొద‌ట‌ టైమ్‌టేబుల్ త‌యారు చేసుకునేట‌ప్పుడు ఒక రోజులో ఏయే స‌మ‌యాల్లో అభ్యర్థులకు ఏకాగ్ర‌త కుదురుతుందో గ‌మ‌నించాలి. దానికి అనుగుణంగానే టైమ్ స్లాట్‌ను కేటాయించుకోవాలి. ఆ స‌మ‌యాల్లోనే అధ్య‌యనం చేయ‌డం ఉత్త‌మం.

‣ ఒక స‌బ్జెక్టులో క‌ఠినంగా అనిపించిన అంశాల‌కు తగినంత సమయం కేటాయించాలి. ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో రే-ఆప్టిక్స్ కష్టమని భావిస్తే.. ఆ స‌బ్జెక్టు చ‌దివేట‌ప్పుడు మిగతా వాటికంటే ఎక్కువ సమయం వెచ్చించాలి.

‣ టైమ్‌‌టేబుల్‌లో విరామాలు ఎంతో ముఖ్యం. అధ్యయన సమయంలో మధ్యమ‌ధ్య‌లో విరామం తీసుకోవాలి. అలా అయితేనే స‌బ్జెక్టుపై మ‌రింత దృష్టి సారించ‌డం సాధ్యమవుతుంది.

2. ఇంట‌ర్నెట్‌లో అదనపు సమాచారం

క‌రోనా సంక్షోభంతో నెల‌లపాటు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. విద్యాసంస్థ‌లైతే దాదాపు ఏడాది వర‌కు మూత‌ప‌డ్డాయి. దీంతో తరగతులు గూగుల్ మీట్స్‌, జూమ్ త‌దిత‌ర మాధ్య‌మాల ద్వారా జ‌రిగాయి. కానీ విద్యాసంస్థ‌ల్లో ఉపాధ్యాయుల కొర‌త‌, సిగ్న‌ల్ లేకపోవడం మొద‌లైన కార‌ణాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ సంద‌ర్భంలో విద్యార్థుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఇంట‌ర్నెట్. నీట్ లాంటి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు దాని అవ‌స‌రం ఎంతో ఉంది. అంతర్జాలంలో అవ‌స‌ర‌మైన స్ట‌డీ మెటీరియ‌ల్స్ అందులో అందుబాటులో ఉంటుంది. పరిశీలించి జాగ్రత్తగా వినియోగించుకోవచ్చు.

3. మరిన్ని పుస్త‌కాలు, మరింత స‌మాచారం

neet exam 2021
మరిన్ని పుస్త‌కాలతో మరింత స‌మాచారం

నీట్‌కు సిద్ధ‌మ‌య్యే అభ్యర్థులు త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన పుస్త‌కాల‌తోపాటు అద‌నంగా మరికొన్ని పుస్త‌కాలను అధ్యయనం చేయడం మంచిది. దానివల్ల మౌలికాంశాలపై పట్టు సులువుగా సాధించవచ్చు. ఒకే పుస్తకంపై ఆధారపడటం వల్ల అవసరమైన సమాచారం అంతా ఉండకవపోచ్చు. అలా అని కనిపించిన ప్రతి పుస్తకాన్నీ చదివేయకూడదు. నిపుణులు, సీనియర్ల సూచన మేరకు అదనపు సమాచారం కోసం కొన్ని పుస్తకాలను తీసుకోవాలి. పోటీలో నిలబడేందుకు ఇది సాయపడుతుంది. అన్నింటినీ చదివేయాలనే ఉత్సాహంలో దేనినీ లోతుగా అధ్యయనం చేయకుండా ఉండకూడదు. ఉద్దేశించిన లక్ష్యం దెబ్బతింటుంది. ఒకటి లేదా రెండు ప్రామాణికమైన ‌పుస్త‌కాల‌ను ఎంచుకుని ఎక్కువగా సాధన చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది.

4. పాత‌, న‌మూనా ప్ర‌శ్న‌ప‌త్రాల సాధ‌న‌

ప‌రీక్ష స‌ర‌ళి ఎలా ఉంటుందో తెలుసుకోవ‌డం ముఖ్యం. ఎందుకంటే ప్ర‌శ్న‌ప‌త్రం ఇవ్వ‌గానే మొద‌ట వేటిపై దృష్టి సారించాల‌నే అవ‌గాహ‌న ఏర్పడుతుంది. అందుకోసం అందుబాటులో ఉన్న పాత‌, న‌మూనా ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను సాధ‌న చేయాలి. అందులోనూ ప‌లు సూచ‌న‌లు పాటించాలి. సిల‌బ‌స్ పూర్తి చేసిన త‌ర్వాతే దీనిపై దృష్టి పెడితే మంచిది. అలాగే అభ్యర్థి ప‌రిష్క‌రిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ఎంత స‌మ‌యం ప‌డుతోందో స్టాప్‌వాచ్‌ సాయంతో గ‌మ‌నించాలి. మ‌రో ప్ర‌య‌త్నంలో స‌మ‌యాన్ని త‌గ్గించుకుని, స‌మాధానాలు త్వ‌ర‌గా గుర్తించ‌డానికి ప్రయత్నించాలి. ప్రాక్టీస్ క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌ల నుంచి సుల‌భ‌మైన వాటి వైపు ఉండాలి. ఇలా చేయడం వల్ల వాస్తవ పరీక్షలో ఎలాంటి విధానాన్ని అమ‌లు చేస్తే బాగుంటుందో బోధ‌ప‌డుతుంది. షార్ట్‌క‌ట్‌లు ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ స‌మాధానాలు గుర్తించే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా చాలా స‌మ‌యం ఆదా అవుతుంది. ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను ప్రాక్టీస్ చేసేటప్పుడు దేనికి సంబంధించిన ప్ర‌శ్న‌లు, అంశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయో గమనించి నోట్ చేసుకోవాలి. వాటిపై మ‌రింత ‌దృష్టి కేంద్రీక‌రించాలి.

5. మంచి ఆహారం, వ్యాయామం ముఖ్యం

చ‌ద‌వాలంటే ఓపికతోపాటు శ‌క్తి కూడా అవ‌స‌రం. అందుకే స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌డం ద్వారా కావాల్సిన శ‌క్తిని పొందుతారు. ఆక‌లిని త‌ట్టుకుని చ‌దువుపై దృష్టి పెట్ట‌డం సాధ్యం కాదు. ఉద‌యం అల్పాహారం నుంచి రాత్రి భోజ‌నం వ‌ర‌కు మెనూను సిద్ధం చేసుకుని తినాలి. అలాగే మాన‌సికంగానూ దృఢంగా ఉండాలి. ఇందుకు వ్యాయామం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతోపాటు యోగా చేయ‌డం మంచిది. ప్ర‌తిరోజు 10 నిమిషాలు యోగా చేయడం వ‌ల్ల చ‌దువుతున్న‌ప్పుడు త్వ‌ర‌గా అలసిపోరు. నిద్ర రాకుండా ఉల్లాసంగా ఉంటారు. రాత్రివేళ స‌రైన నిద్ర కూడా చాలా ముఖ్యం.

ఇదీ చదవండి: ప్రమాదం ఆమె వెన్ను విరిచింది.. సంకల్పం ఆమెను స్ఫూర్తిగా నిలిపింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.