ETV Bharat / city

ఎన్ని పుస్తకాలు చదివినా... సొంతంగా నోట్స్ రాసుకుంటే విజయం నీదే! - ఆచార్య అడపా సత్యనారాయణ

Preparation Strategy for History: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు త్వరలో తెరపడనుంది. పోటీ పరీక్షల కోసం ఇప్పటికే ఎంతో మంది సన్నద్ధమవుతూ ఉన్నారు. మరికొందరు సన్నద్ధతపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలో ‘చరిత్ర అంటే తేదీలు, యుద్ధాలు, అవి జరిగిన ప్రాంతాలు...రాజుల పేర్లు, కట్టడాలు...ఇలా ఎన్నిటినో గుర్తుంచుకోవాలని అధిక శాతం మంది అభ్యర్థులు భయపడుతుంటారు. వాస్తవానికి చరిత్ర తెలుసుకోవడం అంటే అది కాదు’ అంటున్నారు చరిత్ర నిపుణుడు, ఓయూ విశ్రాంత ఆచార్యుడు, టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ సంస్కరణల కమిటీ సభ్యుడు ఆచార్య అడపా సత్యనారాయణ.

adapa sathyanarayana
అడపా సత్యనారాయణ
author img

By

Published : Apr 24, 2022, 9:52 AM IST

Preparation Strategy for History: రాష్ట్రంలో త్వరలో రానున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘చరిత్ర అంటే తేదీలు, యుద్ధాలు, అవి జరిగిన ప్రాంతాలు...రాజుల పేర్లు, కట్టడాలు...ఇలా ఎన్నిటినో గుర్తుంచుకోవాలని అధిక శాతం మంది అభ్యర్థులు భయపడుతుంటారు. వాస్తవానికి చరిత్ర తెలుసుకోవడం అంటే అది కాదు’ అంటున్నారు చరిత్ర నిపుణుడు, ఓయూ విశ్రాంత ఆచార్యుడు, టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ సంస్కరణల కమిటీ సభ్యుడు ఆచార్య అడపా సత్యనారాయణ. తెలంగాణ చరిత్రపై విస్తృత అధ్యయనం చేసిన ఆయన ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి’, ‘రాష్ట్ర అవతరణ ఉద్యమాలు’ ‘తెలంగాణ చరిత్ర- నూతన కోణం’ అనే పుస్తకాలు రచించారు. అభ్యర్థులు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్ని పుస్తకాలు అయినా చదవండి...సొంతంగా నోట్స్‌ రాసుకుంటే పోటీ పరీక్షల్లో ఎంతో ప్రయోజనం పొందుతారని ఆయన సూచిస్తున్నారు. గ్రూపు-1 నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో చరిత్ర సిలబస్‌, దాని సన్నద్ధత, అభ్యర్థులు చేసే తప్పులు...విజయం సాధించాలంటే మెలకువలు తదితర ఎన్నో అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.

పోటీ పరీక్షల్లో ‘చరిత్ర’ ప్రాధాన్యమెంత..
గ్రూపు పరీక్షల నుంచి సివిల్‌ సర్వీసెస్‌ వరకు చరిత్ర సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది. గ్రూపు-1లో అయితే రెండో పేపర్‌గా చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ ఉంది. ఆరో పేపర్‌ తెలంగాణ ఉద్యమం. రాష్ట్ర ఆవిర్భావంలో కూడా 1948 నుంచి తెలంగాణ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక జనరల్‌ ఎస్సేలో చరిత్ర కోణంలో భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని చదవాలి. ఇక ప్రిలిమినరీలో కూడా చరిత్ర ప్రశ్నలుంటాయి. చరిత్రపై అవగాహన ఉంటే ఇప్పటి పరిస్థితులు కూడా లోతుగా అర్థమవుతాయి.

చరిత్ర అంటే పేర్లు.. సంవత్సరాలు గుర్తుంచుకోవాలన్న భయం అభ్యర్థుల్లో ఉంది? దీనిపై మీరేమంటారు..
చాలా మందిలో ఈ అభిప్రాయం ఉన్న మాట వాస్తవం. అందుకే టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో వాటి కంటే చరిత్రలో వివిధ రాజుల కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పరిపాలన తదితర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాం. తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు తదితర రాజుల గురించి చదవాలి. ఏ రాజుల కాలంలో వ్యవసాయం ఎలా ఉంది? నీటి పారుదల, నిర్మించిన కట్టడాలు, యుద్ధాలు, రాజధానులు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు తదితర అంశాలపై ఒక పట్టికను రూపొందించుకుంటే అయోమయానికి గురయ్యే అవకాశం ఉండదు.

అభ్యర్థులు చరిత్రను చదవడంలో ఎక్కడ పొరపాటు చేస్తున్నారు..
చాలా మంది సిలబస్‌ను అర్థం చేసుకోకుండా మొత్తం చదువుకుంటూ పోతున్నారు. ఉదాహరణకు గ్రూపు-1 చరిత్ర పేపర్‌లో ఆధునిక చరిత్రపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా చరిత్ర అంతా చదువుకుంటూ పోతే సమయం వృథా. నాటికాలంలో పాలనా విధానాలు, జీవన పరిస్థితులు, సాహిత్యం, ఆర్కిటెక్చర్‌ తదితర వాటిని అర్థం చేసుకోవాలి. కేవలం చరిత్ర విద్యార్థులే కాకుండా అన్ని రకాల కోర్సులు చదివిన వారు కూడా పరీక్షలు రాస్తున్నారన్న అంశాన్ని గమనంలో ఉంచుకొని సబ్జెక్టు నిపుణులు ప్రశ్నపత్రాలు రూపొందిస్తారన్నది అభ్యర్థులు మరిచిపోరాదు.

అభ్యర్థుల్లో మీరు గుర్తించిన లోపాలు, చేస్తున్న పొరపాట్లు ఏమిటి..
పదుల సంఖ్యలో పుస్తకాలు చదువుతారు. కోచింగ్‌ కేంద్రాల్లో ఇచ్చే స్టడీ మెటీరియల్‌ను కూడా అనుసరిస్తారు. ఎన్ని పుస్తకాలు చదివినా సొంత నోట్స్‌ రాసుకునే వారు తక్కువ మంది. ఒకసారి నోట్స్‌ రాశారంటే 10 సార్లు చదివినట్లే లెక్క. ప్రధాన అంశాలను రాసుకుంటే పరీక్షలకు ముందు త్వరగా పునఃశ్చరణ చేసుకోవచ్చు. తెలుగు అకాడమీ ముద్రించిన, నిపుణులైన ఆచార్యులు, అధ్యాపకులు రాసిన ప్రామాణిక పుస్తకాలు చదవాలి. ఇప్పుడు రెండుమూడు సార్లు పరీక్షల్లో పోటీ పడి విజయం సాధించిన వారు కూడా పుస్తకాలు ఎడాపెడా రాసేస్తున్నారు. అలాంటి వారు రాసినవి చదివితే అభ్యర్థులు నష్టపోతారు. మొదట సిలబస్‌ను పూర్తిగా చదివి...వాటి పరిధిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ప్రధాన పరీక్షల్లో పేజీలు నింపేస్తుంటారు. మూల్యాంకనం చేయడానికి వచ్చేది నిపుణులు కాబట్టి రాతలో అతి తెలివిని ప్రదర్శిస్తే రెండు మూడు నిమిషాల్లో అభ్యర్థిలో విషయం ఉందా? లేదా? అని పసిగడతారు. దానివల్ల అభ్యర్థులు నష్టపోతారు.

ఇదీ చదవండి:tspsc group1: నేడో రేపో గ్రూపు-1 నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.