ETV Bharat / city

ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. కొత్తకొత్తగా తినేద్దాం రండి! - వంటకాలు

New recipes: తినడానికి ఎన్ని రకాలున్నా... ఇంకేదో కొత్తది కావాలనిపిస్తుంది. అందుకే స్టార్‌ షెఫ్‌లు దేశవిదేశీ వంటకాలను కలగలిపి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా చేసినవన్నీ అందరికీ నచ్చకపోవచ్చుగాక. కానీ వాటిల్లో కొన్ని రుచులు మాత్రం ఎక్కువమందిని ఆకట్టుకుని రెస్టరెంట్ల మెనూలోకీ వంటింట్లోకీ వస్తుంటాయి. ఇవన్నీ అలా వచ్చినవే..!

new recipes
కొత్త వంటకాలు
author img

By

Published : Sep 11, 2022, 4:24 PM IST

New recipes: కొన్నింటిని చూసినప్పుడు తినడం మర్చిపోయి, అసలు వాటిని అలా ఎలా చేశారబ్బా అని ఆశ్చర్యపోతుంటాం. ఈ రోటీ జాలా సరిగ్గా అలాంటి వంటకమే.

రోటీ జాలా... ఓ కొత్త దోసె:

.

అచ్చం ఓ జాలీ లేదా వలని చుట్టినట్లుగా ఉండే ఈ రోటీ, ఇప్పుడు మనదగ్గరా కనిపిస్తోంది. ఇది మలేషియాకి చెందిన రోటీ దోసె. గోధుమ లేదా మైదాతో చేస్తారు కాబట్టి పేరుకి రోటీ... కానీ వేసే విధానం మాత్రం దోసెలాగే ఉంటుంది. అందుకే దీన్ని రోటీ/దోసె జాలా అనీ అంటారు. అక్కడి రోడ్డుపక్క దుకాణాల నుంచి స్టార్‌ హోటల్స్‌ వరకూ అన్నిచోట్లా ఇది ఉండాల్సిందే. పెళ్లిళ్లూ పండగలప్పుడు విందు భోజనాల్లో తప్పక వడ్డిస్తారు. ఎందుకంటే ఇది మలయా వాసుల సంప్రదాయ వంటకం. పూర్వం ఆ దీవుల్లో నివసించేవాళ్ల ప్రధాన వృత్తి చేపల వేట... అందుకోసం వలని చూసీ చూసీ తినే రోటీని కూడా వల మాదిరిగా చేసుకుంటేనో అనుకున్నారట నాటి మలేషియన్లు. అలా పుట్టుకొచ్చిందే ఈ రోటీ జాలా.

తయారీ విధానం.. గోధుమ లేదా మైదా పిండిలో కొబ్బరిపాలు లేదా పాలు, నీళ్లు, ఉప్పు, పసుపు, గుడ్లసొన వేసి బాగా గిలకొడతారు. ఆపై ఈ పిండి మిశ్రమాన్ని చక్కిడాలు, కారప్పూస గొట్టాల మాదిరిగా చిల్లులు ఉండే మౌల్డ్స్‌లో పోసి, పెనంమీద వల ఆకారం వచ్చేలా వేస్తారు. కాలిన తరవాత దాన్ని చాపలా చుట్టి, చికెన్‌ లేదా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూరలతో తింటారు. మలేషియాలోని తమిళుల ద్వారా ఇది మరిన్ని మార్పులు చెంది మన వరకూ వచ్చిందన్నమాట. గోధుమ పిండి బదులు సెనగపిండి, బియ్యప్పిండి, రవ్వ, మినప్పిండి... ఇలా రకరకాలు కలుపుతున్నారు. అంతేనా... ఓ స్వీటులా కూడా చేస్తున్నారు. అంటే- కేకు మిశ్రమంలో మాదిరిగా గుడ్లు, పంచదార, మైదా... వంటివన్నీ కలిపి పెనంమీదే జాలీలా వేసి, మూతపెట్టి, ఉడికిన తరవాత రోల్స్‌లా చుడుతున్నారు. లేదంటే వీటిని అలాగే ఉంచి ఒకదానిమీద ఒకటి పేర్చి కేకుల్లా చేసి పుట్టినరోజు వేడుకల్లో కోస్తున్నారట. అందుకే ఒకప్పుడు కేవలం బ్రెడ్డు రుచితో మాత్రమే ఉండే రోటీ జాలా, నేడు కేకు రుచుల్నీ సంతరించుకుని అలరిస్తోంది. మన స్టార్‌ హోటల్‌ షెఫ్‌లు సైతం దీన్ని చూసి ముచ్చటపడి రెస్టరెంట్లలో వడ్డిస్తుండటంతో మనవాళ్లకీ నచ్చేస్తోందట.

రసగుల్లా చాట్‌:

.

చాట్‌ ఎవరైనా ఎందుకు తింటారు... కాస్త కారంగా స్పైసీగా ఉంటుందనే కదా. అలాగే రసగుల్లాని కూడా తియ్యగా తినడానికే ఇష్టపడతారు. అయితే దిల్లీలోని కరోల్‌బాగ్‌కు చెందిన ఓ చాట్‌వాలాకి ఎలా ఐడియా వచ్చిందోగానీ రసగుల్లాని మధ్యలోకి చీల్చి అందులోకి దహీచాట్‌నీ, చింతపండు చట్నీ, స్వీట్‌ చట్నీల్ని నింపి, కాస్త డ్రైఫూట్స్‌ ముక్కల్నీ వేసి అందించాడట. దాన్ని కాస్తా సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇదేంటీ... అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెట్టారట. కానీ ఆ ప్రయోగం చాలామందికి నచ్చేసినట్లుంది. దాంతో రసగుల్లాకి టిక్కీ చాట్‌నీ జోడించి చాట్‌వాలాలు అందిస్తుంటే, ‘ఆహా... ఓహో...’ అంటూ ఓ పట్టు పట్టేస్తున్నారు చాట్‌ప్రియులు.

హాటుహాటుగా.. రైస్‌ బాల్స్‌:

.

బియ్యప్పిండితో రకరకాల స్వీట్లు చేయడం తెలిసిందే. అలాగే అన్నంతో పొంగలీ, పాయసం వంటివీ చేస్తుంటాం. కానీ జపనీయులు మాత్రం అన్నాన్ని గుండ్రని ముద్దలుగా చేసి నువ్వుల్లో దొర్లించి లేదా సముద్ర నాచుతో చుట్టి గ్రిల్‌ చేసిన రైస్‌బాల్స్‌ను ఇష్టంగా తింటారు. ఫాస్ట్‌ఫుడ్డే అయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైన స్నాక్‌. కొన్నిసార్లు ఉడికించిన అన్నాన్ని మిక్సీలో వేసి పిండిలా చేసి మధ్యలో పూర్ణంలా పెట్టి స్వీటులానూ చేసుకుంటారు. మొత్తమ్మీద ఈ రైస్‌బాల్స్‌ మనదగ్గరకీ వచ్చేశాయి. దీనికి బ్రెడ్‌పొడి, ఉప్పు, కారం, జీరా, మైదా, బంగాళాదుంప, మిరియాల పొడి... ఇలా అన్నీ వేసి కలిపి నూనెలో వేయించేస్తున్నారు. అంతేకాదు, జిహ్వకో రుచి అన్నట్లు కొందరు చీజ్‌, మసాలాకూర, కార్న్‌... ఇలా రకరకాల పదార్థాలను కలిపి మరీ తయారుచేసేస్తున్నారు. దాంతో రెస్టరెంట్లలోనూ ఫుడ్‌ట్రక్స్‌లోనూ రైస్‌బాల్స్‌ హాటుహాటుగా పోతున్నాయట.

పండ్లనీ కాల్చేస్తున్నారు:

.

సాధారణంగా పండ్లని నేరుగా తింటేనే మంచిది. లేదంటే జ్యూస్‌ రూపంలో తీసుకుంటారు. అయితే ఎప్పుడూ వాటిని అలాగే ఎందుకు తినాలి అనుకున్నారేమో... కబాబ్స్‌ మాదిరిగా గ్రిల్‌ చేసుకుని మరీ తింటున్నారు. ఇలా చేసినప్పుడు పండ్లలో సహజంగా ఉండే చక్కెర కాలడంతో ఒకలాంటి తియ్యని ఫ్లేవర్‌ వస్తుందట. అందుకే రకరకాల ఫ్రూట్‌ కబాబ్‌లను భోజనం తరవాత తినడం ఓ ట్రెండ్‌గా మారింది. పైగా వీటిని చేయడం చాలా ఈజీ... పుచ్చ, కర్బూజ, పైనాపిల్‌, ద్రాక్ష, అరటి... ఇలా ఏ పండునైనా ముక్కలుగా కోసి స్క్యూయర్‌కి గుచ్చి, ఇష్టమైతే కాస్త మేపుల్‌ సిరప్‌ అద్దుకుని కబాబ్‌లా కాల్చుకోవచ్చు. భోజనం తరవాత గులాబ్‌జామూన్‌, ఐస్‌క్రీమ్‌... వంటి వాటితో పోలిస్తే ఈ ఫ్రూట్‌ కబాబ్‌ ఆరోగ్యకరమైన డెజర్ట్‌... కాబట్టి అందరూ తినొచ్చు అంటున్నారు షెఫ్‌లు.

వావ్‌... టాకోస్‌ :

.

మెక్సికన్‌ ఫుడ్‌ రెస్టరెంట్లకి వెళ్లినవాళ్లు టాకోలను రుచి చూడటం సహజమే. అయితే ఒకప్పుడు పాశ్చాత్యదేశాల్లోనే ఎక్కువగా కనిపించే టాకో బెల్‌, లా టాకో, టాకో జాయింట్‌ ఫుడ్‌ ఛెయిన్స్‌ ఇప్పుడు మన దగ్గరా వచ్చేశాయి. కెఎఫ్‌సి చికెన్‌, డొమినోస్‌ పిజ్జా, మెక్‌డోనాల్డ్స్‌ బర్గర్‌ మాదిరిగానే టాకోబెల్‌ టాకో కూడా యువతకి ఫేవరెట్‌గా మారింది. దాంతో ఒక్క టాకొబెల్‌ అవుట్‌లెట్స్‌లోనే కాదు, మిగిలిన ఫాస్ట్‌ఫుడ్‌ ఛెయిన్స్‌ అన్నీ కూడా రకరకాల టాకోలను తమ మెనూల్లో చేర్చేశాయి. ఇంతకీ అంత ఘనం అందులో ఏముందీ అంటే- మొక్కజొన్న లేదా గోధుమపిండితో చేసిన చిన్న రోటీ(టార్టిల్లా)లో రకరకాల కూరగాయ ముక్కలు, చికెన్‌, చీజ్‌... వంటివన్నీ నింపి, యూ ఆకారంలో మడిచి బేక్‌ చేసి ఇచ్చేదే టాకో. పైనుండే రోటీ కరకరలాడుతూ వాటికి లోపల స్టఫ్‌ చేసినవాటి రుచి తగులుతుంటే ఎవరైనా వావ్‌ అనాల్సిందే అంటోంది నేటితరం. ఇంకా చెప్పాలంటే మసాలా అప్పడంలో రకరకాల కూరలూ సాస్‌లూ క్రీమ్‌...
అన్నీ కలిపి తిన్నట్లు ఉంటుంది. అయితే ఈ మెక్సికన్‌ టాకోలకు భారతీయ షెఫ్‌లు పన్నీర్‌, క్యాప్సికమ్‌, దాల్‌ మఖాని, క్యాబేజీ, కొత్తిమీర-మిర్చి చట్నీల్నీ... ఇంకా చాట్‌ రుచుల్నీ జోడించి ఇండొ-మెక్సికన్‌ ఫ్యూజన్‌ ఫుడ్‌గా మార్చేశారు. దాంతో టాకో... ఆరోగ్యకరమైన ట్రెండీ ఫాస్ట్‌ఫుడ్‌గా మారిపోయింది.

తాటిబెల్లం మిఠాయిలొస్తున్నాయ్‌:

.

కప్పుడు తాటిబెల్లాన్ని ఎవరైనా కొన్నా అజీర్తి చేసినప్పుడు ఓ చిన్నముక్కని నోట్లో వేసుకునేవారు. కానీ అందులోని పోషకాలూ ఔషధగుణాల రీత్యా ఈమధ్య తాటిబెల్లాన్ని ఎక్కువగా వాడటమే కాదు... మైసూర్‌పాక్‌, కాజు కట్లి, లడ్డూ, జిలేబీ, హల్వా... ఇలా ఎన్నో రకాల స్వీట్ల తయారీలోనూ వాడుతున్నారు. దీన్నే తమిళంలో కరుపట్టి అంటారు. పైగా దీని తయారీ వాడకమూ అక్కడ ఎక్కువ కావడంతో కరుపట్టి కాఫీ దుకాణాలూ పుట్టుకొచ్చాయక్కడ. క్రమంగా అక్కడి నుంచి ఈ కరుపట్టి స్వీట్ల రుచి అన్ని ప్రాంతాలకూ తెలిసినట్లుంది... ఆన్‌లైన్‌లోనూ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయట. ఎందుకింత క్రేజ్‌ అంటే... తాటిబెల్లంలో యాంటీఆక్సిడెంట్లూ పీచూ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచి రక్తహీనతని తగ్గిస్తుంది. పైగా ఇతర బెల్లం, చక్కెరలతో పోలిస్తే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువ. దాంతో మధుమేహులు కూడా నిశ్చింతగా స్వీటుని చప్పరించేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.