ETV Bharat / city

అమానవీయం: వైద్యుల నిర్లక్ష్యంతో బాత్​రూంలోనే ప్రసవం

author img

By

Published : Nov 30, 2020, 10:52 PM IST

వికారాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంలో నిండు గర్భిణీ బాత్​రూంలో ప్రసవించింది. ఆమెకు హెచ్​ఐవీ పాజిటివ్​ ఉందని... డెలివరీ చేసేందుకు సౌకర్యాలు లేవని హైదరాబాద్​కు తీసుకెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బందితో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు.

pregnant women delivered in vikarabad government hospital toilet
అమానవీయం: వైద్యుల నిర్లక్ష్యంతో బాత్​రూంలోనే ప్రసవం

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న ఓ నిండు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి బాత్​రూంలోనే ప్రసవించింది. వికారాబాద్ జిల్లా కేంద్రం రామయ్యగూడకు చెందిన గర్భిణీని పురిటి నొప్పులతో కుటుంబసభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవాళ ఉదయం తీసుకొచ్చారు. సాయంత్రం వరకు డెలివరీ కాలేదు. తీరా ఆ మహిళకు హెచ్ఐవీ ఉందని వైద్యులకు తెలిసింది. దీంతో హెచ్ఐవీ పాజిటివ్​ వారికి డెలివరీ చేయడానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని... హైదరాబాద్​కు తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు.

ఈ క్రమంలో కుటుంబసభ్యులు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో బాత్​రూంలోకి వెళ్లిన ఆమె... అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని... అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారం క్రితం ధారూరు మండలానికి చెందిన ఎయిడ్స్ రోగికి ప్రసవం చేయకుండా వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. పై అధికారులకు ఫిర్యాదు చెస్తామంటే ఎవ్వరికైన చెప్పుకోండి అంటూ డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

ఇదీ చూడండి: నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.