ETV Bharat / city

డిశ్ఛార్జి తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి!

కరోనాను జయించిన వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఏ ఒక్కరూ డిశ్ఛార్జి తర్వాత నిర్లక్ష్యం వహించడానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి.

corona precautions after discharge
డిశ్ఛార్జి తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి!
author img

By

Published : Jul 20, 2020, 12:13 PM IST

లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినవారు 10 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటికొస్తున్నారు. లక్షణాలున్న వారు మరికొంత ఆలస్యంగా వస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ డిశ్ఛార్జి తర్వాత నిర్లక్ష్యం వహించడానికి లేదని వైద్యులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఎలా ఉండాలో కూడా వివరిస్తున్నారు.

ఫోన్‌ చేయండి..

ఇంటికెళ్లాక అనారోగ్యంగా అనిపించినా, ఆక్సిజన్‌ శాతం తగ్గినా, కొవిడ్‌ లక్షణాలు తిరిగి కనిపించినా.. వెంటనే కొవిడ్‌ హెల్ప్‌లైన్లకు ఫోన్‌ చేయాలని వైద్యులు చెబుతున్నారు. డిశ్ఛార్జి కార్డులో రాసిన ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలంటున్నారు. మరీ అవసరమైతే వారిని ఆసుపత్రికి తరలిస్తారు.

‘ప్లాస్మా’ ఇవ్వాలి

కోలుకున్న కొవిడ్‌ రోగులు అవసరమైనప్పుడు ప్లాస్మా దానం చేయడానికీ సిద్ధంగా ఉండాలి. కొవిడ్‌ను వీరు జయించినందువల్ల ఆ వైరస్‌తో పోరాడే యాంటీబాడీలు వీరిలో తయారయ్యాయి. వాటిని కలిగి ఉన్న ప్లాస్మా కణాల్ని సేకరించి అవసరమున్న కొవిడ్‌ రోగులకు ఎక్కిస్తే.. వారూ కోలుకుంటారని సూచిస్తున్నారు. ప్రత్యేకించి మధ్యస్త, తీవ్ర స్థాయిలో కొవిడ్‌బారిన పడ్డవారికి ఇది పనికొస్తుందని పేర్కొంటున్నారు.

7 రోజులు హోంక్వారంటైన్‌

డిశ్ఛార్జి అయ్యాక 7 రోజులు కచ్చితంగా హోంక్వారంటైన్‌ అవ్వాలని చెబుతున్నారు. క్వారంటైన్‌లో ఉన్నంతసేపూ మాస్క్‌ని తప్పనసరి చేశారు. అలా ప్రతీ 6నుంచి 8గంటల వరకు మాస్క్‌ను మారుస్తూ ఉండాలి. డిస్పోజబుల్‌ మాస్క్‌ను రెండోసారి వాడకూడదు. వాడిన మాస్క్‌ల్ని ఎలా పడితే అలా పడేయకూడదని సూచిస్తున్నారు.

ప్రవేశం లేదు

హోంక్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఎవ్వరినీ ఇంటికి ఆహ్వానించకూడదు. ప్రభుత్వపరంగా ఎవరైనా వస్తే.. వారికి దూరంగా ఉంటూ వివరాలివ్వాలి. క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి బయటికి వెళ్లకూడదని, జనావాసాల్లో తిరగకూడదని పేర్కొంటున్నారు.

దూరం తప్పనిసరి..

డిశ్ఛార్జి అయినవారు వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. 7రోజుల పాటూ ఎవరూ కలవకుండా జాగ్రత్త వహించాలని, భౌతిక దూరం నిబంధన పాటించాలి.

సహాయం ఒకరితోనే..

డిశ్ఛార్జి అయినవారు ప్రత్యేక గదిలో ఉండాలని, వారికి ఏదైనా అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఇంట్లో కేటాయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సహాయం చేసే వ్యక్తి కూడా జాగ్రత్తగానే ఉండాలి. వీరు ఏదైనా కోలుకున్న రోగికి అందించాల్సి వస్తే ద్వారం దగ్గరనుంచే ఇవ్వాలి.

ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉండాల్సి వస్తే.. ఇద్దరిమధ్య కనీసం మీటరు దూరం ఉండేలా జాగ్రత్త వహించాలి. ఉంటున్న గదిని సోడియం హైపోక్లోరైట్‌ (1శాతం) ద్రావణంతో శానిటైజ్‌ చేసుకోవాలి.

మరుగుదొడ్లతో జాగ్రత్త

ఒకసారి వైరస్‌ వస్తే దాని ఆర్‌ఎన్‌ఏ 35 రోజుల వరకు ఆ వ్యక్తుల మలంలో ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరుగుదొడ్లను నిరంతరం మూసి ఉంచాలని చెబుతున్నారు. వాటిని వినియోగించిన తర్వాత కచ్చితంగా చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలంటున్నారు.

డిశ్ఛార్జి అయిన వ్యక్తి ఇంట్లో వాడిన మరుగుదొడ్లను మరొకరు వినియోగించుకుండా నిర్ణీత రోజుల వరకు జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఇది వీలవని పరిస్థితుల్లో.. ఆ వ్యకి ఒకసారి వాడిన మరుగుదొడ్డిని అరగంటపాటూ మరొకరు వాడకుండా ఉండాలని సూచిస్తున్నారు. మరుగుదొడ్లను ప్రతీ 4గంటలకోసారి హైపోక్లోరైట్‌ (5శాతం) ద్రావణంతో పిచికారి చేయాలని, డిశ్ఛార్జి అయిన వారెవరూ బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.