ETV Bharat / city

తొర్రూర్‌ లే అవుట్‌ వేలంకు సంబంధించి నేడు ప్రీ బిడ్‌ సమావేశం..

Torroor lay out auction: రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు వేలంకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నేడు జరగనుంది. ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ది చేసి విక్రయించేందుకు మార్చి 14,15,16,17 తేదీల్లో ఈ- ఆక్షన్​ నిర్వహించనున్నారు.

Pre-bid meeting today for Torroor lay out auction

author img

By

Published : Feb 25, 2022, 5:44 AM IST

Torroor lay out auction: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్‌లో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు వేలంకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం ఇవాళ జరగనుంది. ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ది చేసి విక్రయించేందుకు మార్చి 14,15,16,17 తేదీల్లో ఈ- ఆక్షన్​ నిర్వహిస్తారు. హెచ్​ఎండీఎ నిర్వహిస్తున్న వేలం ప్రక్రియ ఎంఎస్​టీసీ ద్వారా ఈ-ఆక్షన్‌ పద్దతిలో జరగనుంది.

300 నుంచి 600 గజాల ప్లాట్లు..

మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా 300 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్ల​ సైజుతో లే అవుట్​ ను రూపొందించినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. లే అవుట్​కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి (మాస్టర్​ ప్లాన్​ రోడ్​), లే అవుట్​ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడల్పుతో రహదారులను హెచ్ఎండీఏ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.

కనీస ధర 20 వేలు..

తొర్రూర్​ లే అవుట్​లో గజానికి కనీస ధర(బేసిక్​ రేటు​) రూ.20,000లుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొరూర్​ లే అవుట్​లో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టీసీకి రిజిస్ట్రేషన్​ ఫీజు కింద 1,180లు చెల్లించి నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా ఈ–ఆక్షన్​లో పాల్గొనేందుకు ప్రతి ప్లాట్​కు లక్ష రూపాయల చొప్పున ఎర్లీ మనీ డిపాజిట్​(ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి.

ఆన్​లైన్​లో మరిన్ని వివరాలు..

మార్చి మూడో వారంలో 14 నుంచి 17వరకు ఉదయం తొమ్మిదింటి నుంచి ఒక దఫా​.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరొక దఫా చొప్పున నాలుగు రోజుల పాటు ఆన్​లైన్​ పద్ధతిలో ఎంఎస్​టీసీ ద్వారా ప్లాట్ల ఈ–ఆక్షన్​ ప్రక్రియ జరుగుతుంది. హెచ్ఎండీఏ లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారం హెచ్ఎండీఏ వెబ్​సైట్​లోనూ, ఎంఎస్​టీసీ వైబ్​సైట్​లో వివరాలు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.