గురుకులాల సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ పెంపుతో పీఆర్‌సీ అమలుకు గత జూన్ పదిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేస్తూ అందుకు అనుగుణంగా స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. గురుకుల ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కసరత్తు చేసిన ఆర్థిక శాఖ... పీఆర్సీని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: Smart Criminal: అతని వలలో 30 మంది.. ఎలా మోసం చేశాడంటే!