ETV Bharat / city

Prakasam Barrage: ఉద్ధృతంగా కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల

ఏపీలోని కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. పులిచింత ప్రాజెక్టు నుంచి వస్తోన్న ప్రవాహనికి ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. ఫలితంగా అధికారులు బ్యారేజీ వద్ద 7౦ గేట్లు కొద్దిమేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నది ముంపుప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

prakasham-barrage-gates-lift-and-release-water

author img

By

Published : Jul 23, 2021, 5:33 PM IST

ఉద్ధృతంగా కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల

ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చే వరదకు ఏపీలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజీ వద్ద 7౦ గేట్లును ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

బ్యారేజీకి 75 వేల 811 క్యూసెక్కులు.. కాలువలకు 1561 క్యూసెక్కులు వదలగా.. మిగిలిన 74వేల 250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది పరివాహక, దిగువన ఉన్న ముంపు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తడంతో బ్యారేజీ వద్ద భారీ ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.

కంట్రోల్​ రూం ఏర్పాటు..

పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహపు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టరేట్​లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 0863– 2234014 నంబర్​కు సంప్రదించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్​ సూచించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అదేశించారు.

ఇదీ చదవండి.. Fish Hunting: చెరువులైన పొలాలు... చేపల కోసం ఎగబడ్డ స్థానికులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.