ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులు ప్రగతిభవన్ని ముట్టడించారు. నిరుద్యోగ భృతితో పాటు... పెండింగ్‌లో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ సమీపంలోని పోలీసులు నాయకులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ వెంటనే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులను పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఇవీ చదవండి:రోడ్డు ప్రమాదం... సాయం చేయడానికి వచ్చిన వ్యక్తిపై ఎస్సై దాడి