దూరవిద్య కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్‌ను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విడుదల చేసింది. నవంబరు 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం సంచాలకుడు సీహెచ్. మురళీకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుముతో డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్‌ను యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ నీతూ కుమారి ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు.
దూరవిద్య విధానంలో ఏడాది వ్యవధితో టీవీ జర్నలిజం, జ్యోతిర్వాస్తు పీజీ డిప్లొమా కోర్సులు, రెండేళ్ల లలిత సంగీతం డిప్లొమా కోర్సు, ఏడాది ఫిల్మ్ రైటింగ్, జ్యోతిష్యం డిప్లొమా కోర్సులు, సంగీత విశారద, ఆధునిక తెలుగు, జ్యోతిష్యం సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తెలిపారు. కోర్సులు, ఇతర పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: కోదండరాం