ETV Bharat / city

మంత్రి కొడాలి నాని పిటిషన్​పై విచారణ వాయిదా - ap highcourt news

ఏపీలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని వేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

మంత్రి కొడాలి నాని పిటిషన్​పై విచారణ వాయిదా

author img

By

Published : Feb 15, 2021, 6:25 PM IST

ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్​ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. ఇరువురి వాదనలపై సంతృప్తి చెందని న్యాయమూర్తి ఓ సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని తెలిపారు. తదుపరి విచారణను బుధవారం వరకు వాయిదా వేశారు.

మంత్రి కొడాలి నాని ఎస్ఈసీ, కమిషనర్​పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 12 వీడియోలను ధర్మాసనం ముందు ప్రదర్శించారు. న్యాయమూర్తి వీడియోలను పరిశీలించారు. మంత్రి అనుచితంగా ఎస్ఈసీపై వ్యాఖ్యలు చేసినందుకే మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించామని .. కేసు నమోదు చేయాలని జిల్లా గ్రామీణ ఎస్పీని ఆదేశించినట్లు ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్ఈసీకి వివరణ ఇచ్చినా.. పట్టించుకోకుండా ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరువురి వాదనలతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. రాజ్యాంగ న్యాయసూత్రాలను ఇరువురి న్యాయవాదులు విశదీకరించలేకపోయారని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని ధర్మాసనం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు విని తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'టీవీ ఉంటే రేషన్​ కార్డ్ కట్'​... నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.