ETV Bharat / city

Telangana Weather Updates : రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు - తెలంగాణ వర్షాలు అప్‌డేట్స్

Telangana Weather Updates : తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాన కురిసే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Weather Updates
Telangana Weather Updates
author img

By

Published : May 11, 2022, 9:13 AM IST

Telangana Weather Updates : రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి తెలిపారు. వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana Weather News : గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగొండకు చెందిన గుమ్మడం ఎల్లమ్మ(65), కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ గ్రామీణం మండలం భట్టుపల్లి పంచాయతీ పరిధిలోని సీబాపుకాలనీకి చెందిన రామగిరి పోచుబాయి(58) మంగళవారం వడదెబ్బతో మృతిచెందారు.

Telangana Rain Updates : మరోవైపు అసని తుపాను ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతోంది. ఏపీలోని నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్న తుపాన్.. కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Rains : రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుందని వెల్లడించింది. పూర్తిగా బలహీనపడేవరకూ తీరం వెంబడే పయనించనుందని అధికారులు అంచనా వేశారు. అసని తుపాను తీరానికి అతిదగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.