Telangana Weather News Today : రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ.. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, ఎల్లుండి తేలికపాటి నుంచి.. మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వెల్లడించింది. రేపు మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటన విడుదల చేసింది.
Telangana Weather Update Today : తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడ మీదుగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5కిలోమీటర్లు వద్ద కొనసాగుతుందని తెలిపారు.
- ఇదీ చదవండి : హోలీ రోజు పబ్ తెరిచారు.. ప్రమాదానికి అదే కారణమా.?