ETV Bharat / city

గ్రేటర్ పోరు: గతం కంటే పెరిగింది 1.26 శాతమే - జీహెచ్ఎంసీ పోల్స్ 2020 తేదీ

బల్దియా ఎన్నికల్లో బస్తీలు ఉత్సాహం చూపగా కాలనీలు బద్ధకించాయి. బస్తీల ప్రభావం ఎక్కువ ఉన్న డివిజన్లలో మెరుగైన పోలింగ్‌ శాతం నమోదు కాగా, కాలనీలు ఎక్కువగా ఉన్న చోట్ల తక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.

polling percentage of  ghmc
గ్రేటర్ పోరు: గతం కంటే పెరిగింది 1.26 శాతమే
author img

By

Published : Dec 3, 2020, 6:45 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్‌ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో (45.29%) పోలిస్తే ఇది 1.26 శాతం ఎక్కువ. గురువారం ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీ పోలింగ్‌ జరగనుంది. ఇది పూర్తయిన తర్వాత కచ్చితమైన లెక్కతేలనుంది. యూసఫ్‌గూడ డివిజన్‌లో అతితక్కువగా 32.99 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. సంతోష్‌నగర్‌ డివిజన్‌లో 35.94 శాతం, మియాపూర్‌లో 36.25 శాతం నమోదైంది. ఈ డివిజన్లలో కాలనీ వాసులు ఓటు వేసేందుకు రాకపోవడమే పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. బస్తీలు అధికంగా ఉన్న గాజులరామారంలో 58.61 శాతం, నవాబ్‌సాహెబ్‌ కుంటలో 55.65 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరగడంతో ప్రధాన పార్టీలు ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకువస్తాయని అంతా భావించారు. కానీ కాలనీల నుంచి ఓటర్లు కదలి రాకపోవడంతో పోలింగ్‌ శాతం అంతగా పెరగలేదు. ఈసారి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కలను చెప్పడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి దాదాపు 18 గంటల సమయం పట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు డివిజన్ల వారీగా లెక్కగట్టి 46.55 శాతం నమోదైనట్లు స్పష్టం చేశారు.

సగటున 48.09 శాతం..

పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 24 డివిజన్లు ఉంటే ఈసారి సగటున 48.09 శాతం నమోదైంది. గత బల్దియా ఎన్నికల్లో 47.42 శాతం ఓటింగ్‌ జరగ్గా ఈసారి 0.67 శాతం పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. పాతబస్తీలో చివరి మూడు గంటల్లో కొన్ని డివిజన్లలో కొందరు మళ్లీ మళ్లీ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. మహిళలు గుంపులుగా వచ్చి దొంగ ఓట్లు వేశారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రేటర్‌లో పురుషులు 48.17% మంది ఓటు వేస్తే.. మహిళలు 44.79% మందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 18,60,040 మంది, మహిళలు 15,90,219 మంది కలిపి మొత్తం మీద గ్రేటర్‌లో 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో నిలిచిపోయిన ఎన్నికలను గురువారం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి: ఓల్డ్ మలక్​పేటలో నేడు రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.