ఏపీలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
నాలుగో విడత ఎన్నికలకుగానూ ఏపీలో 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,299 పంచాయతీలకు గానూ 554 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మొత్తం 2,743 పంచాయతీల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 67 లక్షల 75 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.