ETV Bharat / city

pv narasimha rao jayanthi : 'నేటి తరానికి పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు' - pv narasimha rao birth anniversary news

pv narasimha rao jayanthi :దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని పీవీఘాట్‌కు తరలివచ్చిన ప్రముఖులు... దివంగత నేత సేవలను స్మరించుకున్నారు. పీసీ సేవలను గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.... దేశం, మాతృభాషాభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. అసెంబ్లీలో సభాపతి దివంగత చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

pv narasimha rao jayanthi
pv narasimha rao jayanthi
author img

By

Published : Jun 28, 2022, 12:01 PM IST

Updated : Jun 28, 2022, 1:57 PM IST

'నేటి తరానికి పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు'

pv narasimha rao jayanthi : నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషాకోవిదుడైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులోని పీవీ సమాధి జ్ఞాన భూమి వద్ద మంత్రులు, పార్టీల నేతలు నివాళి అర్పించి... ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం, మాతృభాష అభివృద్ధికి పీవీ నరసింహారావు విశేష కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన పీవీని మోదీ సర్కార్‌.... ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన ఆయన.... దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలోని పీవీ గుర్తుకొస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

  • My humble tributes to former Prime Minister, Shri PV Narasimha Rao on his birth anniversary. A visionary statesman and a towering intellectual, he ushered in major economic reforms . Shri Rao was a multifaceted personality—a polyglot, scholar and writer of repute. #PVNarasimhaRao pic.twitter.com/r45cyinrTT

    — Vice President of India (@VPSecretariat) June 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

pv jayanthi : ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన పీవీని మోదీ సర్కార్‌.... ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన ఆయన.... దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నర్సింహారావు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని తరఫున ఘన నివాళులర్పించారు. దిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తామని తెలిపారు. పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలు ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి.. పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. పీవీ గొప్పతనాన్ని తెలిపేలా తపాలా బిళ్ల విడుదల చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

ప్రపంచం ముందు భారత్‌ను గొప్పగా నిలబెట్టిన తెలుగుబిడ్డకు దిల్లీలో సరైన గౌరవం దక్కటంలేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరోపించారు. పీవీ గొప్ప నాయకుడని.. ఆయన తెచ్చిన సంస్కరణల వల్లే దేశం నిలబడిందని తెలిపారు. భారత్​ను ప్రపంచ దేశాల ముందు గొప్పగా నిలబెట్టారని అన్నారు. పీవీకి కాంగ్రెస్‌లో తగిన గౌరవం దక్కలేదని తలసాని వాపోయారు. సీఎం కేసీఆర్​ పీవీ కుమార్తెకు సముచిత స్థానం, గౌరవం కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్​కు వచ్చినప్పుడు పీవీ ఘాట్​ను సందర్శించాలని కోరారు.

పీవీ చూపిన మార్గంలో పయనించి.... తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పాటుపడుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో కలిసి పీవీఘాట్‌లో ఆయన నివాళులర్పించారు. పీవీ ఘాట్​లో పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. పీవీ జీవించి ఉంటే... నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలు చూసి బాధపడేవారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.... పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా.... కాంగ్రెస్‌ శ్రేణులు పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి... నివాళి అర్పించారు.

Last Updated : Jun 28, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.