ETV Bharat / city

మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి - bjp leaders condolence to manikyalarao

ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం జగన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మృతి పార్టీకి తీరని లోటని భాజపా నేతలు సోము వీర్రాజు, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

manikyala rao
manikyala rao
author img

By

Published : Aug 1, 2020, 7:39 PM IST

భాజపా నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

మాణిక్యాలరావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి పట్ల నటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సంతాపం తెలిపారు.

పార్టీ నేతల సంతాపం

మాణిక్యాలరావు మృతి బాధాకరమని.. భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జిల్లా స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మాణిక్యాలరావు మరణవార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. కొవిడ్ బారిన పడి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మాణిక్యాలరావు మృతి భాజపాకు తీరని లోటని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాణిక్యాలరావు సేవలు ఇప్పటికీ స్వయం సేవక్ భావ జాలానికి కట్టుబడి ఉన్నాయని.. ప్రజల కోసం ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తిత్వం ఆయన సొంతమని ఆర్​ఎస్​ఎస్​ నేత భాగయ్య అన్నారు.

కామినేని సంతాపం

మాణిక్యాలరావు మరణం ఏపీ భాజపాకు తీరని లోటని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్​ అన్నారు. నాలుగేళ్లుగా ఆయనతో కలిసి మంత్రిగా పనిచేసినట్లు చెప్పారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేశారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తరలివచ్చిన నేతలు

విజయవాడ హెల్ప్‌ ఆస్పత్రిలోని మాణిక్యాలరావు పార్థివ దేహాన్ని సందర్శించేందుకు భాజపా నేతలు తరలివచ్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్​లో విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం తరలించారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. మాణిక్యాలరావు పార్థివ దేహానికి అంబులెన్స్​ వద్ద భాజపా నేత కన్నా లక్ష్మీ నారాయణ నివాళులర్పించారు.

ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.