ETV Bharat / city

బల్దియా ఎన్నికలపై పోలీస్ నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు - గ్రేటర్ ఎన్నికల్లో పోలీసు బందోబస్తు

జీహెచ్​ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా కేంద్రాల వద్ద అదనపు బలగాలను మొహరిస్తున్నారు. ఇప్పటికే కవాతు నిర్వహించిన బలగాలు... ప్రజలు నిర్భయంగా ఓటేయాలంటూ అభయమిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పోస్టింగులను నియంత్రించేలా తగిన చర్యలు చేపడుతున్నారు.

police security arrangments for ghmc elections in hyderabad
బల్దియా ఎన్నికలకు పోలీసుల భారీ బందోబస్తు
author img

By

Published : Nov 28, 2020, 9:07 PM IST

కొన్ని విధ్వంసక శక్తులు జీహెచ్​ఎంసీ ఎన్నికల ఆసరాగా రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా ఎన్నికలు శాంతిపూర్వక వాతావరణంలో జరిగేలా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 51 వేల500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, స్వీకరణ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మొహరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి...అవసరమైన చోట అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... వీటిని అరికట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

జీహెచ్​ఎంసీ సరిహద్దులతో పాటు నగరంలోని పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,704 సమస్యాత్మక, 1,085 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. దాదాపు 3,500 మంది రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు సీపీ అంజనీ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 770 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. 179 రూట్ మొబైల్ బృందాలతో పాటు ఒక్కో జీహెచ్ఎంసీ సర్కిల్‌కు ఒక్కో ఏసీపీకి బాధ్యతలు అప్పజెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 30 డివిజన్లుండగా... 498 సమస్యాత్మక, 101 అతి సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మై జీహెచ్ఎంసీ యాప్​లో ఓటర్ స్లిప్​, పోలింగ్ కేంద్రం లొకేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.