ETV Bharat / city

amaravathi: ఉద్యమంపై దమనకాండ.. ఎమర్జెన్సీని తలపించేలా ఆంక్షలు - గుంటూరు జిల్లా వార్తలు

అడుగడుగునా బారికేడ్లు.. దారి పొడవునా ఇనుప కంచెలు.. ప్రతి పల్లెలోనూ వందల మంది పోలీసులతో కవాతులు..ఇంటి నుంచి కాలు బయటకు పెట్టటమే నేరమన్నట్లుగా తీవ్ర స్థాయి అణచివేతలు.. ఊరు దాటి ముందుకెళ్లనీయకుండా నిర్బంధాలు.. ఈ దమనకాండ దృశ్యాలు, చిత్రాలను ఏవీ తీయకుండా, చూపించకుండా.. ఎక్కడికక్కడ మీడియాపై ఉక్కుపాదం మోపుతూ చర్యలు.. ఇలా రాజధాని అమరావతి ఉద్యమం ఆదివారం నాటికి 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. వేల మందితో నిర్వహిస్తున్న ప్రభుత్వ, అధికార పార్టీ నాయకుల సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలకు కళ్లు మూసుకుని అనుమతిస్తున్న పోలీసులు.. అమరావతి రైతులు న్యాయదేవతకు, ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామికి గోడు వెళ్లబోసుకునేందుకు అనుమతి ఇవ్వమని కోరితే కొవిడ్‌ ఆంక్షలను సాకుగా చూపి ఇవ్వలేదు.

amaravathi
అమరావతి పోరు
author img

By

Published : Aug 9, 2021, 6:58 AM IST

ఆదివారం తెలవారకముందే 29 రాజధాని గ్రామాల్లో దాదాపు 3000 మంది పోలీసులను మోహరించారు. 100కుపైగా చెక్‌పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరిన వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఆ పల్లెల ప్రజలెవరూ బయటకు రాకుండా.. వేరే ప్రాంతాల నుంచి ఆ ఊళ్లలోకి ఎవరూ ప్రవేశించకుండా దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తోపులాటలు చోటుచేసుకుని రాజధాని రైతు కట్టా రాజేంద్రకు కాలు విరిగిపోగా, మరో మహిళా రైతు పొత్తి కడుపుపై ఓ పోలీసు కాలితో తన్నారు. ఓ యువతి గొంతు వద్ద ఓ మహిళా కానిస్టేబుల్‌ గట్టిగా పట్టుకోవడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురిని గోళ్లతో రక్కేశారు. మహిళలనీ చూడకుండా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. మొత్తంగా రాజధానిలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అయినా ఆంక్షల్ని, నిర్బంధాల్ని, ముళ్లకంచెల్ని దాటుకుని కొందరు రైతులు హైకోర్టు సమీపానికి, మంగళగిరి గుడికి చేరుకుని లక్ష్యాన్ని సాధించారు.

వివిధ రాజధాని గ్రామాల నుంచి తుళ్లూరు శిబిరానికి చేరుకున్న మహిళలు, రైతులు... అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసుల కళ్లుగప్పేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక్కసారిగా శిబిరం నుంచి బయటకు వచ్చి... ఏం జరుగుతోందో పోలీసులు గ్రహించే లోపే, మూడు బృందాలుగా విడిపోయి తలోదిక్కుకూ వేగంగా కదిలారు. పెద్ద సంఖ్యలో మహిళలు, కొందరు రైతులతో కూడిన ఒక బృందం హైకోర్టు వైపు పరుగులు తీసింది. తేరుకున్న పోలీసులు వారిని వెంబడించి, రెండు మూడు చోట్ల తాళ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వలయాన్ని ఛేదించుకుని వారు పొలాల వెంట పరుగులు తీశారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు హైకోర్టు ఎదురు రోడ్డులోకి చేరుకొని నినాదాలు చేశారు. వారిలో పిల్లలు, వృద్ధులూ కూడా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి కొందరు రైతులు పోలీసుల నిర్బంధాలను దాటుకుని మంగళగిరి చేరుకున్నారు. మొదట వారు కొండపై ఉన్న పానకాలస్వామి గుడికి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరుగుతుండగా... కొందరు వాళ్ల కళ్లుగప్పి విడి విడిగా సాధారణ భక్తుల్లా కొండ దిగువన ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ వారు జై అమరావతి అని నినాదాలు చేయడంతో... ఉలిక్కిపడిన పోలీసులు వారిని వేగంగా చుట్టుముట్టారు. ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా రైతులు... ‘‘సీఎం డౌన్‌, డౌన్‌..., ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, పోలీసుల దౌర్జన్యం నశించాలి...’’ అంటూ నినాదాలు చేశారు.

ఎమర్జెన్సీ రోజులను తలపించేలా..!

రాజధాని ఉద్యమం ఆరు వందల రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి గ్రామాల ప్రజలు, రాజధానికి భూములిచ్చిన రైతులు చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా మీడియాపై గుడ్లురిమారు..! బయటి నుంచి ఒక్క మీడియా ప్రతినిధి రాజధాని గ్రామాల్లోకి అడుగుపెట్టినా బాగోదని, కెమేరాలు బయటకు తీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లోకి మీడియా ప్రతినిధులెవర్నీ అడుగు పెట్టనివ్వవద్దని పై నుంచి తమకు ఆదేశాలున్నాయని చెప్పారు. పోలీసులు తమను ఆటంకపరుస్తున్న, అరెస్టులు చేస్తున్న దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న రాజధాని ప్రజల్నీ అడ్డుకున్నారు. కొందరి చేతుల్లోంచి ఫోన్లు లాగేసుకున్నారు.

నేతలపై నిఘా

రాజధాని ప్రజల ఉద్యమానికి మద్దతిచ్చేందుకు తరలివస్తారన్న అనుమానం ఉన్న నాయకులపై పోలీసులు ముందు నుంచే నిఘా పెట్టారు. ఆదివారం ఉదయమే వారి నివాసాల వద్ద మోహరించారు. ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నాయకుల కదలికలను వారి సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేస్తూ పసిగట్టారు. రాజధాని గ్రామాల ప్రజలు రోజూ నిరసనలు తెలిపే శిబిరాలన్నిటినీ ఉదయమే ముట్టడించారు. వివిధ గ్రామాలకు చెందిన ఉద్యమకారులు రెండు మూడు ప్రధాన శిబిరాల వద్దకు చేరుకొని అక్కడి నుంచి న్యాయస్థానం సమీపానికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. వివిధ పార్టీల నాయకుల్ని, ప్రజల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు పార్టీల నాయకులు, ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులు సహా మొత్తం మీద 377 మందిని పోలీసుస్టేషన్లకు తరలించారు. వారిలో పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే రాజధానిలోకి వచ్చే రహదారులన్నీ దిగ్బంధించారు. రాజధానిలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికీ ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకూ నోటీసులిచ్చారు. అత్యవసర పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళాల్సి ఉంటే... ఆధార్‌ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తేనే పంపించారు. రాజధాని గ్రామాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్ని అడ్డుకుని, ప్రయాణికుల్ని పూర్తిగా తనిఖీ చేశాకే పంపించారు.

వారిపై సానుకూలత..

ఒక పక్క అమరావతి పరిరక్షణకు శాంతియుత ర్యాలీ తలపెట్టిన వారిపై ఉక్కుపాదం మోపిన పోలీసులు... మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ శిబిరం నిర్వహిస్తున్న వారి విషయంలో సానుకూలంగా వ్యవహరించారు. శిబిరంలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఆటోల్లో వచ్చిన వారినీ అనుమతించారు. ఒకే ఆటోలో 10 మందికిపైగా వచ్చినా... పోలీసులకు కొవిడ్‌ నిబంధనలు గుర్తు రాలేదు. మూడు రాజధానులకు మద్దతుగా మంగళగిరి నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించేందుకు.... ఆటోల్లో మంగళగిరి వస్తున్న వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వారికి సున్నితంగా నచ్చజెప్పి, కాసేపటికే అవే ఆటోల్లో రాజధానిలో వారు నిర్వహిస్తున్న శిబిరానికి పంపించేశారు.

గర్జించిన మహిళలు..!

రాజధాని ఉద్యమాన్ని మొదటి నుంచీ ముందుండి నడిపిస్తున్న మహిళలు... ఆదివారం కూడా పోలీసు నిర్బంధాలను అదే పట్టుదలతో ఎదుర్కొన్నారు. వివిధ రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హైకోర్టు సమీపానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. కొందరు మహిళలు మంగళగిరి వెళ్లేందుకూ బయల్దేరారు. మండే ఎండనూ, ఇనుప కంచెల్ని, ముళ్ల పొదల్నీ లెక్క చేయకుండా... ర్యాలీలో పాల్గొనేందుకు కదం తొక్కారు. తమను అడ్డుకుని, దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని నిలదీశారు. వారిని బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని తీసుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఆ క్రమంలో వారు పోలీసుల్ని వీలైనంత వరకు ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున ఉద్యమ నినాదాలు చేశారు. మందడంలో ఒక యువతిని... ఒక మహిళా కానిస్టేబుల్‌ గట్టిగా గొంతునొక్కడంతో... అక్కడి మహిళలంతా తిరగబడ్డారు. మహిళా పోలీసులు దుస్తులు వేసి, పోలీసులు కానివార్ని తీసుకొచ్చి తమపై దాష్టీకం చేస్తున్నారని ఆరోపించారు. ఆ మహిళా కానిస్టేబుల్‌ గుర్తింపు కార్డు చూపించాలని గట్టిగా నిలదీశారు. ‘మా ఊర్లో మమ్మల్నే ఆధార్‌ కార్డు అడుగుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి మా గొంతు నొక్కేసి, మీరు మాత్రం గుర్తింపు కార్డు ఎందుకు చూపించరు? పోలీసు దుస్తుల్లో బయటి వాళ్లు రాత్రికి రాత్రే వచ్చి మమ్మల్ని మర్డర్‌ చేసి పోతే ఏంటి పరిస్థితి’ అని నిలదీశారు. కొన్ని గ్రామాల్లో... మొక్కు తీర్చుకునేందుకు మహిళలు గ్రామ దేవత గుడికి వెళుతున్నా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు గట్టిగా నిలదీయడంతో... పోలీసు పహారాలో వారిని గుడికి తీసుకెళ్లారు.

ముందుండి నడిపిస్తున్న మహిళలు..

రాజధాని ఉద్యమాన్ని మొదటి నుంచీ ముందుండి నడిపిస్తున్న మహిళలు... ఆదివారం పోలీసు నిర్బంధాలనూ అదే పట్టుదలతో ఎదుర్కొన్నారు. మండే ఎండనూ, ఇనుప కంచెల్ని, ముళ్ల పొదల్నీ లెక్క చేయకుండా... ర్యాలీలో పాల్గొనేందుకు కదం తొక్కారు. తమను అడ్డుకుని, దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున నినాదాలతో ఉద్యమాభిలాషను చాటారు.

అమరావతికి వెలుగులను కాంక్షిస్తూ...

ప్రజా రాజధాని అమరావతికి పూర్వ వైభవం రావాలని కాంక్షిస్తూ 29 గ్రామాల్లో ఆదివారం ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. 600వ రోజు నిరసనలు ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో రైతులు, మహిళలు, చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. దీపాలు, కొవ్వొత్తులు, కాగడాలను వెలిగించి 600 ఆకారంలో ఉంచారు. ఒక వైపు వాన కురుస్తున్నా... తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, మోతడక, దొండపాడు, తదితర గ్రామాల్లో ఇళ్లల్లో, శిబిరాల్లో సామూహికంగా నిర్వహించారు. పలుచోట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆకారంలో పూలతో అలంకరించిన చిత్రపటం చుట్టూ దీపాలను ఉంచారు. సర్వమత చిహ్నాలను ప్రదర్శించారు. పలుచోట్ల దీపాలు, కొవ్వొత్తులు పట్టుకుని శిబిరాల నుంచి ఆలయాల వరకు ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరులో 600 ఆకారంలో మహిళలు కూర్చొని దీపాలు వెలిగించారు. అమరావతి అజరామరంగా నిలవాలని అన్ని చోట్లా ప్రార్థించారు. తమ ఉద్యమం ఫలప్రదమవ్వాలని కోరుకుంటూ, ప్రభుత్వ మొండి వైఖరిని నిరసించారు. పాలకుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నినదించారు.

వైకాపాను ప్రజలు అణచివేస్తారని గుర్తుంచుకోవాలి

‘ప్రజా పోరాటాన్ని లాఠీలతో అణచి వేయాలని ప్రభుత్వం చూస్తోంది. త్వరలో ప్రజలు వైకాపాని అణచివేస్తారన్న విషయాన్ని సీఎం జగన్‌ గుర్తుంచుకోవాలి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజధాని గ్రామాలు పాకిస్థాన్‌ సరిహద్దును తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని సగం మంది పోలీసులు అమరావతిలోనే ఉన్నారు. ఉద్యమమే లేదన్న వైకాపా నేతలు వేల మంది పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారు? వైకాపా నేతలు ఉసిగొల్పినట్లుగా చేయడం పోలీసులకు భావ్యం కాదు. మహిళలనూ రోడ్లపై ఈడ్చుకెళ్లారు. జగన్‌లో నెలకొన్న అభద్రతా భావానికి ఇవన్నీ నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయనడానికి ఇవే సాక్ష్యాలు’ - అచ్చెన్నాయుడు, ఏపీ తెదేపా అధ్యక్షడు.

అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అంగీకరించలేదా?

‘మోసం అనే పదం సీఎం జగన్‌ను చూసి పుట్టిందేమో అనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని స్వాగతించారు. నేడు అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అడ్డుకుంటున్నారు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. ‘జగన్‌ మోసానికి, దివాళాకోరు తనానికి ఇదే నిదర్శనం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? వారేమైనా సంఘ విద్రోహ శక్తులా? రాష్ట్ర భవిష్యత్తుకు భూముల్ని త్యాగం చేయటం రైతుల తప్పా? 3 రాజధానుల ప్రకటన చేసి 600 రోజులైనా 6 ఇటుకలూ పేర్చలేదు. వైకాపా హయాంలో పౌరహక్కులు, స్వేచ్ఛ అనే పదాలు రాజ్యాంగానికే పరిమితమయ్యాయి’ . - యనమల

రాజధాని రైతులదే అంతిమ విజయం

‘రోడ్లనూ తవ్వేస్తూ అమరావతిని చంపేశామని సీఎం జగన్‌ ఆనందపడుతున్నారు. ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. అవమానాల్ని భరిస్తూనే అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులదే అంతిమ విజయం. అణచివేత, అరెస్టులకు బెదరకుండా 600 రోజులుగా ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ అంటూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అయినా ప్రజా రాజధాని పరిరక్షణ పోరాటాన్ని మహోద్యమంగా మార్చారు. అమరావతి పేరు వింటేనే సీఎం జగన్‌ వణికిపోతున్నారు’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్లు చేశారు. ‘ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి మద్దతు ప్రకటించి.. తర్వాత ఎందుకు ఉద్దేశాన్ని మార్చుకున్నారో జగన్‌ చెప్పాలి. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం ద్వారా ప్రభుత్వం, పార్టీ పతనానికి సీఎం స్వయంగా శంకుస్థాపన చేసుకున్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు నకిలీ ఉద్యమాన్ని అధికార పార్టీ ప్రోత్సహించటం సిగ్గుచేటు’ - నారా లోకేశ్‌, తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

ఇదీ చదవండి:

AMARAVATI: రాజధాని గ్రామాల్లో అడుగడుగునా ఆంక్షలు.. ఉద్రిక్తత.. 61 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.