ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ రావు తెలిపారు. బేగంపేట లెర్నింగ్ సెంటర్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి ఎదుగుదల చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి, సినీనటి జయసుధ, నటుడు తనికెళ్ల భరణికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా వారు కూడా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: హరితహారం మహాయజ్ఞంలా సాగుతోంది: మంత్రి కొప్పుల