ETV Bharat / city

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: సజ్జనార్

హైదరాబాద్​లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సానుభూతి తెలిపి అనంతరం వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.

అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను సన్మానించిన కమిషనర్ సజ్జనార్
author img

By

Published : Oct 21, 2019, 8:05 PM IST

అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను సన్మానించిన కమిషనర్ సజ్జనార్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వందనం చేశారు. అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పిస్తోందని గుర్తుచేశారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను కమిషనర్ సన్మానించారు.

సీఆర్పీఎఫ్ అమర వీరుల స్తూపం వద్ద డీఐజీ నివాళులు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో సీఆర్పీఎఫ్ అమర వీరుల స్తూపం వద్ద సౌత్ జోన్ డీఐజీ దర్శల్ లాల్ నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల ప్రాణ త్యాగాల గురించి వివరించారు. 21 అక్టోబర్ 1959లో పోలీసుల పోరాటన్ని కొనియాడారు.
పోలీసులు చేసే త్యాగం చాలా గొప్పది : డీసీపీ పద్మజ
పోలీసుల సేవలను, జ్ఞాపకాలను ఎల్లప్పుడూ తాము విస్మరించబోమని బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అల్వాల్ ఠాణాలో పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా రక్షణ కోసం పోలీసుల చేసే త్యాగం ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. ప్రజా రక్షణలో భాగంగా అమరులైన పోలీస్ కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇవీ చూడండి : హుజూర్​నగర్​లో కొనసాగుతున్న పోలింగ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.