ఇవీ చదవండి:
సీఎం ఇంటి ముట్టడి దృష్ట్యా పోలీసుల భారీ భద్రత, రోడ్ల వెంబడి ముళ్లకంచె ఏర్పాటు - ap latest news
HIGH SECURITY AT CM CAMP OFFICE ఏపీలో సీపీఎస్ రద్దు చేయాలంటూ సెప్టెంబర్ 1న ఉద్యోగులు తలపెట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమంతో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నివాస పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దారి తీసే ప్రాంతాల్లో రోడ్డు వెంబడి ముళ్ల కంచెలు పెట్టారు. ప్రధానంగా విజయవాడ నుంచి తాడేపల్లికి వచ్చే మార్గంలో వారధి దాటాక జాతీయ రహదారి పక్కన భారీగా ముళ్లకంచెలు వేశారు. హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి ఎవరూ దిగకుండా కిలోమీటర్ల పొడవునా ముళ్లకంచెలు అడ్డు పెడుతున్నారు. అలాగే సీఎం ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
CM CAMP OFFICE
ఇవీ చదవండి: