శంషాబాద్‌లో యువకుడి అదృశ్యం వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తనని క్యాబ్ డ్రైవర్ అపహరించి నగదు, సామగ్రి దోచుకెళ్లాడంటూ ప్రవీణ్ అనే యువకుడు చెప్పిందంతా డ్రామానేనని పోలీసులు తేల్చేశారు. అసలు ప్రవీణ్ లండన్ నుంచే రాలేదని పోలీసులు గుర్తించారు. లండన్ నుంచి వచ్చినట్లు తల్లిదండ్రులను పోలీసులను తప్పుదారి పట్టించాడని తెలిపారు. గతంలో లండన్ నుంచి తిరిగి వచ్చిన ప్రవీణ్... కొంతకాలం ఇక్కడే ఉన్నాడు. మళ్లీ లండన్ వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టాడు. ఇన్నాళ్లుగా చెన్నైలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు లండన్ నుంచి రాగానే క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడంటూ ప్రవీణ్ డ్రామా ఆడాడని పోలీసులు నిర్ధారించారు. ప్రవీణ్‌కు మరో 15 రోజుల్లో వివాహం కావాల్సి ఉంది. ప్రస్తుతం అతను కర్ణాటకలోని కోలార్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం.
ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు