చిత్తూరులో ఇటీవల పోలీసులే దొంగతనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఆర్ ఎస్సై మహమ్మద్ గుండెపోటుతో ప్రాణాలను వదిలాడు.
ఇదీ జరిగింది:
చిత్తూరులో వస్త్రాలు విక్రయించే స్థలంలో ఈ నెల 4న ఏఆర్ ఎస్సై, కానిస్టేబుల్ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యానులో దుస్తులు ఉంచి విక్రయింస్తుంటాడు. రాత్రి దుకాణం మూసి బట్టలన్నీ మూట కట్టి తరువాత రోజు పొద్దున్నే యథావిధిగా వచ్చాడు. చూసేసరికి బట్టలు తక్కువగా ఉండడాన్ని గుర్తించాడు.
ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమేరా ఫుటేజీ చూసేసరికి యూనిఫాంలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ కాజేసినట్లు గుర్తించాడు. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. వస్త్రాల చోరీకి పాల్పడిన ఎస్సై మహమ్మద్, కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు.
ఇదీ చూడండి: సైదాబాద్ ఘటన మరువక ముందే.. జగిత్యాల జిల్లాలో మరో బాలికపై అత్యాచారం