ETV Bharat / city

యూటీఎఫ్​ "చలో సీఎంవో".. పోలీసుల తనిఖీలు.. సామాన్యులకు ఇబ్బందులు - చలో సీఎంవో పిలుపు నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు

Police checkings: ఏపీలో సీపీఎస్ రద్దు చేయాలంటూ.. యూటీఎఫ్ తలపెట్టిన సీఎంవో ముట్టడి నేపథ్యంలో.. ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీల పేరుతో ప్రయాణికులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేస్తుండటంతో.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Police checkings:
యూటీఎఫ్​ చలో సీఎంవో
author img

By

Published : Apr 25, 2022, 3:05 PM IST

Police checkings: ఆంధ్రప్రదేశ్​లో యూటీఎఫ్ ఆందోళన నేపథ్యంలో సామాన్య ప్రజలకు.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తనిఖీల పేరుతో ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వివిధ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గుర్తింపు కార్డు చూపాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు వాపోయారు. జంక్షన్ కూడలి నుంచి విజయవాడ వైపు వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు మళ్లింపు చేస్తున్నారు.

ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆసుపత్రికి వెళ్తున్నామని చెబుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నూజివీడులో భారీ బందోబస్తు.. సీఎంవో ముట్టడి పిలుపు నేపథ్యంలో నూజివీడులో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడకు వెళ్లే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేశారు. విజయవాడ మినహా మిగతా ప్రాంతాలకు యథావిధిగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడకి వెళ్లే బస్సులను నిలిపివేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుస్తుగా రిజర్వేషన్‌ చేసుకుని వచ్చామని... తీరా బస్టాండ్‌కి వచ్చాక బస్సులు నిలిపివేశామని చెబుతున్నారని వాపోయారు. మరోవైపు నూజివీడు రైల్వేస్టేషన్​లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న కాకినాడ ఫాస్ట్ రైలులో ప్రతి బోగీ తనిఖీ చేశారు.

వాహనాల తనీఖీలు.. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు.. కృష్ణాజిల్లా పెనమలూరులోని కంకిపాడులో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చలో సీఎంవోకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు, అరెస్టులతో గుంటూరు జిల్లాలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దుగ్గిరాల మండలం పెరికలపూడి ప్రాథమిక పాఠశాలకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడిని నిన్ననే పోలీసులు అదుపులోకి తీసుకుని దుగ్గిరాల స్టేషన్లో ఉంచారు. దీంతో ఇవాళ బడికి తాళం తీసే వారు కూడా లేరు. పాఠశాల ముందు విద్యార్థులు ఉదయం నుంచి ఎదురు చూపులు చూస్తున్నారు. టీచర్ వస్తారో రారో కూడా వారికి తెలియని పరిస్థితి.

పల్నాడు జిల్లా.. వినుకొండలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. యూటీఎఫ్ తలపెట్టిన "సీఎంవో ముట్టడి""కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వినుకొండ మీదుగా రాయలసీమ ప్రాంత నాయకులు వివిధ మార్గాల్లో వెళ్లకుండా పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు.. సామాన్యులకు ఇబ్బందులు

ఇవీ చదవండి: హరిక్షేత్రంలో శివోహం.. పరమేశ్వరునికి కేసీఆర్ దంపతుల పూజలు

ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు? ఎన్ని కేటాయించారు?: హైకోర్టు

రూ.15వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.