జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మంగళహాట్పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని మంగళహాట్ పీఎస్ పరిధిలో గల మోచి బస్తీలో నివాసం ఉంటున్న కుటుంబీకులు ఇల్లుకు తాళం వెయ్యకుండా గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న 5 లక్షల నగదుతో పాటు రెండున్నర తులాల బంగారు ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా రెండు రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. నాలుగు లక్షల 60 వేలతో పాటు రెండున్నర తులాల నెక్లెస్ను రికవరీ చేసినట్లు ఇన్స్పెక్టర్ రణ్వీర్ రెడ్డి తెలిపారు. రికవరీ అయినటువంటి నగదును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామన్నారు. 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కాలనీల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఓ ప్రముఖ బంగారు దుకాణంలో భారీ చోరీ!