ETV Bharat / city

దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.! - corona effect on police

కరోనా.. పోలీసు శాఖకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో జనజీవన కార్యకలాపాలు ఊపందుకోవడం, నేరాలు యథా స్థితికి చేరుకోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో వైరస్‌ బారిన పడకుండా నిందితుల్ని అరెస్టు చేయడం మొదలు, రిమాండ్‌ ఖైదీలుగా జైళ్లకు తరలించడం వరకు అన్నీ వారికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి.

thief
thief
author img

By

Published : Jun 8, 2020, 10:43 AM IST

పోలీసులకు కరోనా కొత్త సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేసిన పోలీసులకు.. నేరగాళ్లను పట్టుకోవడంలో కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. గతంలో నేరగాళ్లను జంకూబొంకూ లేకుండా ఠాణాలకు తరలించేవారు. ఇబ్బందిపెట్టే వారిని బలవంతంగానైనా లాక్కెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా భయంతో నేరస్థులను చేతులతో తాకేందుకే భయపడాల్సి వస్తోందని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అది మరో సవాల్​

"అందుకే బుజ్జగింపులతో వారిని ఠాణాలకు తరలిస్తున్నాం. ఠాణాకు సమీపంలో ఉన్న వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. బలవంతంగా తరలించాల్సి వస్తే ఠాణాలకు వెళ్లాక విధిగా శానిటైజ్‌ చేసుకుంటున్నాం. నేరస్థులను న్యాయస్థానానికి తరలించేప్పుడూ మరో సవాల్‌ ఎదురవుతోంది. కరోనా ప్రాథమిక పరీక్షలు చేయించిన తర్వాతే న్యాయమూర్తుల ఎదుట ప్రవేశ పెట్టాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం." అని వారు వాపోతున్నారు.

జైలుకు తరలింపులోనూ తంటాలే

న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన అనంతరం నిందితుల్ని జైలుకు తరలించే సమయంలోనూ పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. "జైలు లోపలికి అనుమతించే ముందే అక్కడి డిస్‌ఇన్ఫెక్టెడ్‌ టన్నెల్‌లో గుండా నిందితులను తీసుకెళ్లాలి. తప్పనిసరిగా స్నానం చేయించాలి. రెండు మూడు గంటల తర్వాత డిజిటల్‌ థర్మా మీటరుతో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయించాలి. అప్పుడు సాధారణ ఉష్ణోగ్రత నమోదైతేనే జైలు సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే రిమాండ్‌లోకి తీసుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నిందితుల్ని తిరిగి ఠాణాకు తరలించాల్సి వస్తోంది. ఇంత సమయం వారితో ఉండాల్సి రావడంతో ఎక్కడ కరోనా సోకుతుందోననే భయం వెంటాడుతోంది." అని కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: సామాన్యుడికి 'కరెంట్'​ షాక్​.. బిల్లు రూ.80 లక్షల కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.