ETV Bharat / city

వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్​

author img

By

Published : Nov 8, 2020, 1:40 PM IST

1916 తర్వాత ఈ ఏడాదే భారీ వర్షాలు కురిశాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం సీఎం రూ.550 కోట్లు కేటాయించారని.. బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయంలో విపత్తు రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR
వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్​

హైదరాబాద్‌ చరిత్రలో అతిపెద్ద వర్షపాతం ఈ ఏడాదే నమోదైందని కేటీఆర్ వెల్లడించారు. క్యుములోనింబస్ మేఘాల వల్లనే అసాధారణ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. 1908లో మూసీకి వరదలు పోటెత్తాయని చరిత్ర చెబుతోందన్న కేటీఆర్.. 1916 తర్వాత ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయన్నారు.

చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్లే వందలాది కాలనీలు నీటమునిగాయని కేటీఆర్ తెలపారు. ప్రభుత్వం అప్రమత్తతతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. చాలావరకు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగామన్నారు. వైపరీత్యాలను ఎదుర్కొవడానికి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 800 మందితో డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అవసరమైతే మరో రూ.100 కోట్లు..

క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని.. తనతోపాటు ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించారన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు వెల్లడించారు. తక్షణ సాయం కోసం సీఎం రూ.550 కోట్లు కేటాయించారని.. బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు.

4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరద సాయం అందించామన్న కేటీఆర్.. సాయం అందిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించామని స్పష్టం చేశారు. బాధితులందర్ని ఆదుకుంటామని.. అవసరమైతే మరో రూ.100 కోట్లు కేటాయిస్తామని కేటీఆర్​ వెల్లడించారు. పంటనష్టంపై నివేదిక రాగానే సీఎం నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. సీఈ స్థాయి అధికారితో మూడేళ్లలో ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు.

సాయం చేసినా.. ధర్నా చేశారు..

తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్, భాజపా బురద రాజకీయం చేశాయని కేటీఆర్ మండిపడ్డారు. వరద సాయం పంపిణీని కొంతమంది రాజకీయం చేస్తున్నారని.. విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయంలో విపత్తు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్ కార్యాలయాలకు వెళ్లి అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సైదాబాద్‌లో భాజపా కార్యకర్త ఇంటికెళ్లి అధికారులు సాయం అందించారని.. సాయం అందుకున్న భాజపా కార్యకర్త కూడా ధర్నాలో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు.

లేఖకు ప్రధాని స్పందించలేదు..

రూ.8,860 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రధానికి మోదీకి.. సీఎం కేసీఆర్ లేఖ రాసినట్లు తెలిపిన కేటీఆర్.. ఇప్పటి వరకు లేఖకు స్పందన లేదన్నారు. కర్ణాటక విషయంలో మాత్రం ప్రధాని మోదీ తక్షణమే స్పందించారని.. ఆ రాష్ట్ర సీఎం లేఖ రాసిన 4 రోజులకే రూ.649 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా గుజరాత్ వెళ్లి రూ.500 కోట్లు ప్రకటించినట్లు గుర్తుచేశారు.

దుబ్బాకలో వారికి డిపాజిట్​ రాదు..!

రాష్ట్రంలో నలుగురు భాజపా ఎంపీలు ఉన్నారని.. నాలుగు పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్​ మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే స్పందించారా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి సహాయమంత్రో.. నిస్సహాయ మంత్రో తెలియదని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని కేటీఆర్​ జోస్యం చెప్పారు.

ఇవీచూడండి: మానవ తప్పిదాలతోనే ప్రకృతి విలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.