PM Modi on Chittoor accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద బస్సు లోయలో పడి మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
-
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
— PMO India (@PMOIndia) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodi
">ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
— PMO India (@PMOIndia) March 27, 2022
మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodiఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
— PMO India (@PMOIndia) March 27, 2022
మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodi
చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు లోయలో పడిన ప్రమాద ఘటనలో... అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన 8 మంది మృతి చెందారు. మారుతి నగర్‌కు చెందిన యువకుడి నిశ్చితార్థం కోసం... తిరుచానూరుకు ఓ ప్రైవేటు బస్సులో 50 మంది పైగా బయలుదేరారు. భాకరాపేట వద్ద బస్సు అతివేగంతో లోయలోకి దూసుకెళ్లడంతో.. వరుడి కుటుంబానికి చెందిన నలుగురు, ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ చనిపోగా... 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి