ETV Bharat / city

Tirumala vaikunta dwara darshan: జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం - ap latest news

Tirumala vaikunta dwara darshan: ఏపీలోని తిరుమలలో జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచలేదన్నారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుందని వివరించారు.

Tirumala vaikunta dwara darshan
Tirumala vaikunta dwara darshan
author img

By

Published : Dec 28, 2021, 8:28 PM IST

Tirumala vaikunta dwara darshan: జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచలేదని.. రోజుకు 45 వేలమంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల, తిరుపతి స్థానికులకు ఆఫ్‌లైన్‌లో 5 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుండగా.. స్థానికేతరులకు ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని.. భక్తులు కొవిడ్ నెగిటివ్, టీకా సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజూ.. శ్రీవాణి ట్రస్టు భక్తులకు రూ.300 దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

వీఐపీ సిఫార్సులు స్వీకరించబోం

జనవరి 1, వైకుంఠ ద్వారదర్శనం రోజుల్లో.. వీఐపీ సిఫార్సులు స్వీకరించబోమని ధర్మారెడ్డి తెలిపారు. నేరుగా తిరుమలకు వచ్చిన వీఐపీలనే దర్శనాలకు అనుమతిస్తామని..
వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లను రద్దు చేసినట్లు వివరించారు. జనవరి 11న తిరుమలలో పూర్తిగా వసతి గదుల కేటాయింపు రద్దు చేసినట్లు తెలిపిన ఆయన.. వైకుంఠద్వార దర్శన రోజుల్లో ఉ. 4 నుంచి రాత్రి 12 వరకు అన్నప్రసాద వితరణ జరగనుందని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగుతారన్నారు. జనవరి 10 నుంచి రెండో ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.