దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన 100 కొవిడ్ కేర్ కోచ్‌లను.. రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తేవాలని.. హైకోర్టులో న్యాయవాది రామారావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.
రైల్వే కోచ్‌లను వినియోగంలోకి తీసుకొస్తే.. సుమారు 1000 అత్యవసర చికిత్స పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కోచ్‌లపై ఈనెల 6నే దక్షిణ మధ్య రైల్యే ప్రకటన చేసిందని.. సుమారు రెండు వారాలు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానం రూపొందించలేదని న్యాయవాది తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 18(1) ప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలంటూ ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది రామారావు కోరారు.
ఇవీచూడండి: అదనంగా 20కోట్ల కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి