టోల్ గేట్ రుసుము రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది డి.విద్యా సాగర్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. టోల్ గేట్ రుసుము లేకపోతే.. రహదారుల నిర్వహణ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. టోల్ గేట్ రుసుములోనూ వివక్ష చూపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదించారు. సామాన్యుల నుంచి వసూలు చేస్తూ.. ప్రజా ప్రతినిధులకు మినహాయింపునిస్తున్నారని తెలిపారు. ఎవరెవరికి మినహాయింపులు ఇస్తున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు