ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించేందుకు టెలికమ్యునికేషన్ నిపుణులతో కేంద్ర విజిలెన్స్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్ ద్వారా తక్షణం కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని పిటిషనర్ అభ్యర్థించారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి: న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు: ఎంపీ రఘురామకృష్ణరాజు