రాష్ట్రంలో మొదటి విడతలో 25,649 పీజీ సీట్లు భర్తీ కాగా... మరో 12,410 పీజీ సీట్లు మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మ గాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల్లో ఎంకాం, ఎంఎస్సీ, ఎంఏ వంటి సంప్రదాయ పీజీ కోర్సులు కన్వీనర్ కోటాలో 38,059 సీట్లు ఉన్నాయి. సీపీగెట్లో ఉత్తీర్ణులైన 40,182 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
మొదటి విడతలో సీటు వచ్చిన విద్యార్థులు ఈనెల 17 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఒకవేళ రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొనే ఆలోచన లేకపోతే కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ చేయవచ్చునని ఆయన సూచించారు. కాలేజీల్లో టీసీ మినహా మిగతా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కన్వీనర్ పేర్కొన్నారు.