దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో.. 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు చేయూత అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే.. తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.